Breaking News

ఆటో ఎక్స్‌పో.. స్పందన అదరహో

Published on Mon, 01/20/2025 - 08:07

దేశ రాజధానిలోని భారత్‌ మండపంలో నిర్వహిస్తున్న భారత్‌ మొబిలిటీ గ్లోబల్‌ ఎక్స్‌పో 2025లో తమ ఫేవరెట్‌ కొత్త కార్లు, బైక్‌లను చూసేందుకు వాహన ప్రియులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఆదివారం నుంచి సాధారణ ప్రజానీకాన్ని కూడా అనుమతిస్తుండటంతో ఎంట్రీ పాయింట్లు, సెక్యురిటీ చెక్‌ పాయింట్ల దగ్గర ప్రజలు బారులు తీరారు. సమీప ప్రాంతాల నుంచి కూడా వాహన ప్రియులు పెద్ద సంఖ్యలో వస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. భారీ జన సందోహాన్ని ఊహించిన కంపెనీలు కూడా డిస్‌ప్లే ఏరియాల్లో మరింత మంది సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నాయి. పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్లు వాహనాల తయారీ సంస్థల సమాఖ్య డైరెక్టర్‌ జనరల్‌ రాజేశ్‌ మీనన్‌ తెలిపారు.

అత్యవసర పరిస్థితుల్లో సత్వరం స్పందించేందుకు పెద్ద ఎత్తున ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌లు, వైద్య సదుపాయాలు మొదలైనవి ఏర్పాటు చేసినట్లు వివరించారు. జనవరి 17 నుంచి 22 వరకు జరిగే ఆటో ఎక్స్‌పోలో తొలి రెండు రోజులు మీడియా, వ్యాపార వర్గాలకు కేటాయించగా.. మిగతా రోజుల్లో సందర్శకులను అనుమతిస్తున్నారు. ఆటోమొబైల్‌ కంపెనీలు తొలి రెండు రోజుల్లో 90 పైచిలుకు కొత్త వాహనాలను ఆవిష్కరించాయి. పలు కాన్సెప్ట్‌లు, సరికొత్త ఆటోమోటివ్‌ టెక్నాలజీల మొదలైన వాటిని కూడా ప్రదర్శిస్తున్నాయి.

ఇదీ చదవండి: స్మాల్‌క్యాప్‌ ఫండ్‌ పరిమాణం పెరిగితే..?

భారత్‌లో తయారీకి సిద్ధం: బీవైడీ

అన్నీ కలిసి వస్తే భారత్‌లో తయారీ కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చైనాకి చెందిన బీవైడీ ఇండియా ఎలక్ట్రిక్‌ ప్యాసింజర్‌ వాహనాల విభాగం హెడ్‌ రాజీవ్‌ చౌహాన్‌ తెలిపారు. ప్రణాళికలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని వివరించారు. భారత్‌ మొబిలిటీ గ్లోబల్‌ ఎక్స్‌పో 2025లో తమ ప్రీమియం ఎలక్ట్రికి ఎస్‌యూవీ సీలయన్‌7ను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. భారత్‌లో తమకు ప్రస్తుతం ఏ కంపెనీతోనూ తయారీ కాంట్రాక్టులు లేవని ఆయన చెప్పారు. దేశీయంగా కంపెనీ కార్యకలాపాలు సాగించడానికి సంబంధించి చైనీయులపై భారత్‌ వీసా ఆంక్షల ప్రభావమేదేనా ఉందా అనే ప్రశ్నకు స్పందిస్తూ.. అలాంటిదేమీ లేదని చౌహన్‌ చెప్పారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)