Breaking News

ఆటో విడిభాగాల పరిశ్రమ రూ. 3.32 లక్షల కోట్లకు అప్‌

Published on Fri, 12/13/2024 - 01:05

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో దేశీయంగా ఆటోమోటివ్‌ విడిభాగాల పరిశ్రమ 11 శాతం వృద్ధి చెందింది. రూ. 3.32 లక్షల కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో పరిశ్రమ రూ. 2.98 లక్షల కోట్ల స్థాయిలో ఉంది. ఆటోమోటివ్‌ కాంపొనెంట్‌ మాన్యుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌ (ఏసీఎంఏ) ప్రెసిడెంట్‌ శ్రద్ధా సూరి మార్వా ఈ విషయం తెలిపారు. 

‘ఎగుమతులకు సంబంధించి భౌగోళిక, రాజకీయ సవాళ్లు నెలకొన్నప్పటికీ వివిధ విభాగాలవ్యాప్తంగా వాహన విక్రయాలు కరోనా పూర్వ స్థాయికి చేరిన నేపథ్యంలో విడిభాగాల పరిశ్రమ కూడా వృద్ధి చెందింది.‘అని ఆమె తెలిపారు. పండుగ సీజన్‌లో కూడా అమ్మకాలు గణనీయంగా నమోదయ్యాయని వివరించారు. అయితే, ఆర్థిక సంవత్సరంలో గత ఎనిమిది నెలల ధోరణి చూస్తే టూవీలర్ల వృద్ధి ఆశావహంగానే ఉన్నప్పటికీ, ప్యాసింజర్‌.. కమర్షియల్‌ వాహనాల అమ్మకాలు ఒక మోస్తరుగానే నమోదైనట్లు పేర్కొన్నారు. 

అటు ఎగుమతుల విషయానికొస్తే భౌగోళిక సవాళ్ల కారణంగా డెలివరీ సమయం, రవాణా వ్యయాలు మళ్లీ పెరిగాయని మార్వా వివరించారు. టెక్నాలజీని అప్‌గ్రేడ్‌ చేసుకోవడం, స్థానికంగా తయారీ కార్యకలాపాలను విస్తరించడంపై పరిశ్రమ గణనీయంగా ఇన్వెస్ట్‌ చేస్తోందని చెప్పారు. ఏసీఎంఏ ప్రకారం .. సమీక్షాకాలంలో ఎగుమతులు 7 శాతం పెరిగి 11.1 బిలియన్‌ డాలర్లకు, దిగుమతులు 4 శాతం పెరిగి 11 బిలియన్‌ డాలర్లకు చేరాయి. 150 మిలియన్‌ డాలర్ల మిగులు నమోదైంది. ఆఫ్టర్‌మార్కెట్‌ విభాగం కూడా 5 శాతం వృద్ధి చెంది రూ. 47,416 కోట్లకు చేరింది.

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)