Breaking News

అరబిందో ఫార్మా లాభం రూ. 571 కోట్లు

Published on Mon, 08/14/2023 - 06:35

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఔషధ రంగ దిగ్గజం అరబిందో ఫార్మా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ. 571 కోట్ల లాభం నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో నమోదైన రూ. 521 కోట్లతో పోలిస్తే ఇది సుమారు 10 శాతం అధికం. ఇక సమీక్షాకాలంలో ఆదాయం 10 శాతం వృద్ధి చెంది రూ. 6,236 కోట్ల నుంచి రూ. 6850 కోట్లకు చేరింది.

సమీక్షాకాలంలో అమెరికా మార్కెట్లో ఫార్ములేషన్స్‌ విభాగం ఆదాయం 11 శాతం పెరిగి రూ. 3,304 కోట్లకు, యూరప్‌ ఆదాయం 18 శాతం వృద్ధి చెంది రూ. 1,837 కోట్లకు చేరినట్లు సంస్థ తెలిపింది. పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాల కోసం ఆదాయంలో సుమారు 6 శాతాన్ని (రూ. 388 కోట్లు) వెచ్చించినట్లు వివరించింది. కొత్త ఆర్థిక సంవత్సరాన్ని పటిష్టమైన వృద్ధి, మార్జిన్లతో సానుకూలంగా ప్రారంభించడం సంతోషకరమైన అంశమని సంస్థ వైస్‌ చైర్మన్‌ కె. నిత్యానంద రెడ్డి తెలిపారు. రాబోయే రోజుల్లోనూ తమ వృద్ధి వ్యూహాలను పటిష్టంగా అమలు చేయగలమని, వాటాదారులకు దీర్ఘకాలికంగా మరిన్ని ప్రయోజనాలను చేకూర్చగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.  

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు