Breaking News

రేర్‌ ఎర్త్‌ మెటల్స్‌పై ఆంక్షలతో ఉపాధికి దెబ్బ

Published on Tue, 06/24/2025 - 10:31

రేర్‌ ఎర్త్‌ మెటల్స్‌ ఎగుమతిపై చైనా ఆంక్షలు విధించడంతో దేశీయంగా ఈ ప్రభావం ఆటోమొబైల్‌సహా పలు రంగాలపై కనిపించనుంది. ఈ ప్రభావంతో ఆడియో ఎల్రక్టానిక్స్‌ పరిశ్రమలో 21,000 ఉద్యోగాలు రిస్క్‌లో పడనున్నట్లు ఎల్రక్టానిక్స్‌ పరిశ్రమల సమాఖ్య ఎల్సినా.. ప్రభుత్వానికి నివేదించింది. ఏప్రిల్‌లో టెర్బియం, డిస్‌ప్రోజియం తదితర రేర్‌ ఎర్త్‌ ఎలిమెంట్స్‌ ఎగుమతిపై చైనా కఠిన ఆంక్షలకు తెరతీసింది.

వీటిలో అధిక నాణ్యతగల (హైపెర్ఫార్మెన్స్‌) ఎన్‌డీఎఫ్‌ఈబీ(నియోడైమియం–ఐరన్‌–బోరన్‌) మ్యాగ్నెట్లు తదితరాలున్నాయి. ఇవి ప్రధానంగా కన్జూమర్‌ ఎల్రక్టానిక్స్‌ తయారీలో వినియోగించే కీలక ముడిసరుకులు కావడంతో ఈ ప్రభావం దేశీయంగా కనిపిస్తోంది. వీటి సరఫరాలకు విఘాతం కలగడంతో దేశీయంగా వేగవంత వృద్ధిలో ఉన్న వాచీలు, వినికిడి సంబంధిత(ఇయర్‌ ఫోన్స్, బడ్స్‌) ఎల్రక్టానిక్‌ వస్తువుల తయారీ దెబ్బతింటున్నట్లు ఎల్సినా పేర్కొంది. దీంతో పూర్తిస్థాయిలో తయారైన స్పీకర్‌ మాడ్యూల్స్‌ను చైనా నుంచి దిగుమతి చేసుకోవలసి వస్తున్నట్లు తెలియజేసింది.

ఇదీ చదవండి: ఐటీఆర్‌ ఫైల్‌ చేస్తున్నారా? ముందు జాగ్రత్తలు..

ఎలక్ట్రానిక్‌ వస్తు తయారీకి విఘాతం కలగడమేకాకుండా దిగుమతులపై అధికంగా ఆధారపడవలసిన పరిస్థితులు తలెత్తుతున్నట్లు వివరించింది. ఫలితంగా స్పీకర్, ఆడియో విడిభాగాల పరిశ్రమపై ఆధారపడిన  5,000–6,000 ప్రత్యక్ష ఉద్యోగాలకుతోడు పరోక్షంగా 15,000మంది ఉపాధిపై ప్రతికూల ప్రభావం పడనున్నట్లు వెల్లడించింది. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలతోపాటు నోయిడాలో ఉపాధి కల్పన దెబ్బతినే వీలున్నట్లు పేర్కొంది. 

Videos

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)