ఏయూ స్మాల్‌ బ్యాంక్‌ లాభం రూ.393 కోట్లు

Published on Fri, 01/20/2023 - 04:42

ముంబై: ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ డిసెంబర్‌ త్రైమాసికానికి ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు 30 శాతం పెరిగి రూ.393 కోట్లుగా నమోదైంది. ఆస్తుల నాణ్యత మెరుగుపడ డం, మొండి బకాయిలకు (ఎన్‌పీఏలు) కేటాయింపులు తగ్గడం లాభాల వృద్ధికి కలిసొచ్చింది. మొ త్తం ఆదాయం 36 శాతం పెరిగి రూ.2,413 కోట్లు గా నమోదైంది. ప్రధానంగా నికర వడ్డీ ఆదాయం 41 శాతం జంప్‌ చేసి రూ.1,153 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్‌ 6.3 శాతంగా నమోదైంది.   

ఆస్తుల నాణ్యత మెరుగు
మొత్తం రుణాల్లో స్థూల ఎన్‌పీఏలు 1.81 శాతంగా (రూ.1,019 కోట్లు) ఉన్నాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఇవి 2.60 శాతం (రూ.1,058 కోట్లుగా) ఉండడం గమనార్హం. నికర ఎన్‌పీఏలు 1.29 శాతం (రూ.520 కోట్లు) నుంచి 0.51 శాతానికి (రూ.285 కోట్లు) పరిమితమయ్యాయి. డిసెంబర్‌ త్రైమాసికంలో రూ.176 కోట్ల కేటాయింపులు చేసింది. రుణ వ్యాపారంలో బలహీన వృద్ధిని చూపించింది. పరిశ్రమ వ్యాప్తంగా రుణాల మంజూరు జోరుగా ఉంటే, ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు డిసెంబర్‌ త్రైమాసికంలో 7 శాతం వృద్ధిని నమోదు చేసింది. మొత్తం రుణాలు రూ.56,335 కోట్లుగా, డిపాజిట్లు 5 శాతం పెరిగి రూ.61,101 కోట్ల చొప్పున ఉన్నాయి. కాసా రేషియో 38 శాతానికి చేరింది. నిధులపై వ్యయాలు 6 శాతంగా ఉన్నాయి. మొత్తం రుణాల్లో 90 శాతం రిటైల్‌ విభాగంలో ఉంటే, 93 శాతం రుణాలు సెక్యూర్డ్‌గా బ్యాంక్‌ తెలిపింది.

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)