Breaking News

వర్క్‌ ఫ్రం హోం: అటు ఎక్కువ పని, ఇటు హ్యాపీలైఫ్‌ అంటున్న ఐటీ దిగ్గజం

Published on Fri, 09/01/2023 - 16:24

Atlassian CEO Scott Farquhar కోవిడ్‌ మహమ్మారి, లాక్‌డౌన్‌ సమయంలో కంపెనీలకు  'వర్క్ ఫ్రమ్ హోమ్' బాగా ఉపయోగపడింది. కరోనా తగ్గిపోవడంతో దాదాపు అన్ని  కంపెనీలు 'హైబ్రిడ్' విధానానికి స్వస్తి పలికి, ఉద్యోగులను తిరిగి కార్యాలయానికి రావాలని  ఆదేశిస్తున్నాయి. ముఖ్యంగా 'వర్క్ ఫ్రమ్ ఆఫీస్'  విధానాన్ని సమర్ధిస్తున్న వారిలో  ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ప్రముఖంగా నిలుస్తారు. ఇంటి నుండి పనిచేసే వ్యక్తులనుంచి తక్కువ ఫలితం ఉంటుందనేది ఆయన వాదన.

అయితే అట్లాసియన్ సహ-వ్యవస్థాపకుడు, సీఈవో బిలియనీర్ స్కాట్ ఫర్క్హార్ మాత్రం ఇందుకు బిన్నంగా ఉన్నాడు 2023లో 8.2 బిలియన్‌ డాలర్ల నెట్‌వర్త్‌తో ఆస్ట్రేలియాలో 7వ అత్యంత సంపన్నుడైన  స్కాట్‌ ఇంటి నుండి పని చేయడమే మేలు అంటాడు. తన ఉద్యోగులను కూడా  ఇంటినుంచి పనికే  ప్రోత్సహిస్తున్నాడు.

డైలీ మెయిల్ ప్రకారం  స్కాట్‌ తన కంపెనీలు చాలామంది ఉద్యోగులను ఇంటి నుండి పని చేయడానికి అనుమతినిచ్చాడు. తద్వారా వారు పనిలో మరింత ఉత్పాదకతను కలిగి ఉంటారనీ,  ఏకకాలంలో  అటు ఉద్యోగం, ఇటు సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు అనేది స్కాట్‌ విశ్వాసం. ఇళ్ల రేట్లు బాగా ఉండే ఖరీదైన నగరం  సిడ్నీలో  అట్లాసియన్ ప్రధాన కార్యాలయం ఉంది.ఇక్కడ అద్దెలు ఎక్కువే. దీనికి తోడు భయంకరమైన ట్రాఫిక్ కారణంగా ఆఫీసుకు రావాలంటే గంటల సమయం పడుతోంది. ఇదే తనను రిమోట్‌ వర్కింగ్‌పై మళ్లించిందని చెప్తాడు.  అంతేకాదు  స్వయంగా స్కాట్ ఫర్క్హర్  3 నెలలకు ఒకసారి కార్యాలయానికి వెళ్తాడు. 

సిడ్నీలో హౌసింగ్ వెనుక భారీ మొత్తం చెల్లించే బదులు,  ఉద్యోగులు మంచి జీవితాన్నిగడిపేలా నగరానికి కొంచెం దూరంగా బీచ్ సైడ్ అపార్ట్‌మెంట్లలో ఉండవచ్చని, అలాగే ఇంటినుంచి పనిచేస్తే ఆఫీస్‌కు వచ్చి పోయే సమయం కూడా ఆదా అవుతుంది అంటాడు. తన ఉద్యోగులు ఎక్కడ నుంచి పనిచేశారనేది కాకుండా వారిచ్చే  ఔట్‌పుట్‌ ఏంటి అనేదే తనకు ముఖ్యమని  ఫర్‌క్హార్ చెప్పుకొచ్చారు. 

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)