Breaking News

అటల్ పెన్షన్ యోజన కొత్త రికార్డు!

Published on Tue, 05/26/2026 - 18:27

సామాజిక భద్రతా పథకం ‘అటల్‌ పెన్షన్‌ యోజన’ (ఏపీవై) కింద సభ్యుల సంఖ్య ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2026–27) 10 కోట్ల మార్క్‌ను అధిగమిస్తుందని పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి మండలి (పీఎఫ్‌ఆర్‌డీఏ) చైర్మన్‌ ఎస్‌ రామన్‌ తెలిపారు. 2026 మార్చి చివరికి ఏపీవై సభ్యులు 8.96 కోట్లుగా ఉన్నట్టు చెప్పారు.

అంతక్రితం ఆర్థిక సంవత్సరం (2025 మార్చి నాటికి)లో సభ్యుల సంఖ్య 7.61 కోట్లతో పోల్చితే, గత ఆర్థిక సంవత్సరంలో 1.35 కోట్ల మంది కొత్త సభ్యులు జతయ్యారు. 18 శాతం వార్షిక వృద్ధి అంచనా ఆధారంగా సభ్యుల సంఖ్య 10 కోట్ల మార్క్‌ను అధిగమిస్తుందని అంచనా వేస్తున్నట్టు రామన్‌ పేర్కొన్నారు.

ఎన్‌పీఎస్‌ కూడా పీఎఫ్‌ఆర్‌డీఏ నియంత్రణల కిందే నడుస్తుండడం గమనార్హం. 18–25 ఏళ్ల వయసు వారి నుంచి ఎక్కువ మంది సభ్యులు చేరుతున్నారని.. దీర్ఘకాల ఆర్థిక భద్రతపై యువతలో అవగాహన పెరుగుతుండడాన్ని ఇది సూచిస్తున్నట్టు రామన్‌ చెప్పారు. ఎన్‌పీఎస్‌ కింద 2026 మార్చి నాటికి 2.17 కోట్ల మంది సభ్యులు ఉండగా, వీరికి సంబంధించి రూ.15.95 లక్షల కోట్ల పింఛను నిధి నిర్వహణలో ఉన్నట్టు రామన్‌ తెలిపారు. ఈ ఏడాది ఎన్‌పీఎస్‌ సభ్యుల సంఖ్య 22 శాతం పెరగొచ్చని అంచనా వేశారు.

Videos

హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ DK శివకుమార్ అనే నేను

ఆకాశం నుంచి నిప్పుల వాన

నువ్వు, నీ దిక్కుమాలిన ఆలోచనలు... పనికొచ్చే పని చేయవా..?

బాబు లోకేష్ ని ఇమిటేట్ చేసిన కొడాలి నాని ఓ రేంజ్ లో మాస్ వార్నింగ్

సిగ్గులేకుండా మహానాడుకు, స్త్రీ శక్తి అని పెట్టుకున్నారు

పినరయి విజయన్ నివాసం వద్ద ED టీం పై CPM దాడి

రెండ్రోజుల ఢిల్లీ పర్యటనలో సీఎం జోసెఫ్ విజయ్

పోలీస్ ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన సాక్షి రిపోర్టర్

భారత కంపెనీల లాభాలకు రిస్క్ ఆందోళనలో పారిశ్రామికవేత్తలు

ప్రతి ఇంట్లో బాబు వెన్నుపోటు పాలనపె చర్చ జరగాలి

Photos

+5

వడ్డే నవీన్ ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ మూవీ సాంగ్‌ లాంచ్‌ (ఫొటోలు)

+5

‘మిస్టర్ మిడిల్ క్లాస్’ సినిమా టీజర్ ఆవిష్కరణ (ఫొటోలు)

+5

వైభవ్ సూర్యవంశీ.. విధ్వంసానికి కేరాఫ్ అడ్రస్ (ఫొటోలు)

+5

'సమ్మర్ హాలీడేస్' సినిమా టీజర్ లాంచ్ (ఫొటోలు)

+5

ఈ బుక్‌లెట్‌ ప్రతి ఇంటికీ చేరాలి: వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

మోహినీ రూపంలో అవతారంలో శ్రీగోవిందరాజస్వామి (ఫొటోలు)

+5

హీరో ఉపేంద్ర ఇంట్లో శుభకార్యం (ఫొటోలు)

+5

చిట్టి గౌనులో నజ్రియా క్యూట్‌ లుక్స్‌(ఫోటోలు)

+5

మెరిసిపోతోన్న కాజల్... అదిరిపోయిన అందాల చందమామ లేటెస్ట్ ఫోటో షూట్

+5

విశాఖపట్నంలో గాలివాన బీభత్సం (ఫొటోలు)