Breaking News

ఆస్టన్‌ మార్టిన్‌ వాంటేజ్‌ @ 4 కోట్లు

Published on Fri, 08/30/2024 - 02:03

న్యూఢిల్లీ: సూపర్‌ లగ్జరీ కార్ల తయారీలో ఉన్న బ్రిటిష్‌ కంపెనీ ఆస్టన్‌ మార్టిన్‌ భారత్‌లో కొత్త వాంటేజ్‌ను విడుదల చేసింది. ఎక్స్‌షోరూం ధర రూ.3.99 కోట్లు. 4.0 లీటర్‌ ట్విన్‌ టర్బో వీ8 ఇంజన్, 8 స్పీడ్‌ జడ్‌ఎఫ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్, ఎల్రక్టానిక్‌ పవర్‌ అసిస్టెడ్‌ స్టీరింగ్, బావర్స్‌ అండ్‌ విలి్కన్స్‌ 15 స్పీకర్స్‌ సౌండ్‌ సిస్టమ్, 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ పొందుపరిచారు. 

ఈ 2 డోర్ల కూపే 665 పీఎస్‌ పవర్, 800 ఎన్‌ఎం టార్క్‌ అందిస్తుంది. గరిష్ట వేగం గంటకు 325 కి.మీ. 3.5 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. కీలకమైన, ఆశాజనక మార్కె ట్‌ కాబట్టే  ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న అన్ని మోడళ్లను భారత్‌లోనూ విడుదల చేస్తున్నట్లు ఆస్టన్‌ మార్టిన్‌ న్యూఢిల్లీ ఆపరేషన్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఆనంద్‌ తెలిపా రు. సెప్టెంబర్‌ 2న అంతర్జాతీయంగా వీ12 మోడల్‌ను కంపెనీ విడుదల చేస్తోంద న్నారు. ఈ మోడల్‌ భారత్‌లో తొలిసారిగా వెంటనే అందుబాటులోకి వస్తోందన్నారు.

ఉత్తరాది కంటే వేగంగా దక్షిణాది.. 
సూపర్‌ లగ్జరీ కార్ల మార్కెట్‌ దేశంలో రెండేళ్లుగా ఏటా 35–40% వృద్ధి చెందుతోందని ఆనంద్‌ చెప్పారు. గతేడాదితో పోలిస్తే కంపెనీ అమ్మకాల్లో 90% వృద్ధి నమోదైందని వివరించారు. ఆస్టన్‌ మార్టిన్‌ కార్ల అధికారిక దిగుమతిదారుగా ఆస్టన్‌ మార్టిన్‌ న్యూఢిల్లీ వ్యవహరిస్తోంది.  ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుండి  పెరుగుతున్న డిమాండ్‌ను అధిగమించడానికి కంపెనీ నెట్‌వర్క్‌ను విస్తరించనుంది. ప్రస్తుతం కంపెనీకి న్యూఢిల్లీలో షోరూం ఉంది. ఏడాది చివరికల్లా బెంగళూరులో ఔట్‌లెట్‌ రానుంది. సూపర్‌ లగ్జరీ స్పోర్ట్స్‌ కార్స్‌ మార్కెట్‌ ఉత్తరాది కంటే దక్షిణాది వేగంగా వృద్ధి చెందుతోందని ఆనంద్‌ తెలిపారు.


 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)