Breaking News

అన్నింటికీ ఒక్కటే టీడీఎస్‌

Published on Thu, 11/21/2024 - 06:15

న్యూఢిల్లీ: అన్ని రకాల చెల్లింపులకు 1 శాతం లేదా 2 శాతం టీడీఎస్‌ (మూలం వద్దే పన్ను కోత) అమలు చేయాలని వాణిజ్య మండలి ‘అసోచామ్‌’ ప్రభుత్వానికి కీలక సూచన చేసింది. వివాదాల నివారణకు, పన్ను నిబంధనల అమలును సులభతరం చేసేందుకు ఇలా కోరింది. బడ్జెట్‌కు ముందు కేంద్ర ఆర్థిక శాఖకు పలు సూచనలతో కూడిన వినతిపత్రాన్ని అందించింది. కొన్ని రకాల టీడీఎస్‌ వైఫల్యాలను నేరంగా పరిగణించరాదని కూడా కోరింది. 

కొన్ని రకాల చెల్లింపులకు టీడీఎస్‌ అమలు చేయకపోవడాన్ని నేరంగా చూడరాదని, ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించడం ద్వారా పన్ను చెల్లింపుదారు ప్రయోజనం పొందిన కేసుల్లోనే ఇలా చేయాలని అసోచామ్‌ ప్రెసిడెంట్‌ సంజయ్‌ నాయర్‌ సూచించారు. ‘‘వివాదాలను తగ్గించడం, నిబంధనల అమలు మెరుగుపరచడం పన్ను సంస్కరణల లక్ష్యం అవుతుందని భావిస్తున్నాం. ఈ దిశగా కార్పొరేట్‌ రంగం నిర్మాణాత్మక సూచనలు చేసింది. పెట్టుబడులు, వినియోగాన్ని పెంచే చర్యల కోసం కూడా కార్పొరేట్‌ ఇండియా చూస్తోంది’’అని చెప్పారు. 

కంపెనీల విలీనాలు, వేరు చేయడాలకు పన్ను న్యూట్రాలిటీని అందించాలని కూడా అసోచామ్‌ కోరింది. పన్ను అంశాల్లో సమానత్వాన్ని ట్యాక్స్‌ న్యూట్రాలిటీగా చెబుతారు. మూలధన లాభాల మినహాయింపులు లేదా నష్టాలను క్యారీ ఫార్వార్డ్‌ చేసుకునే విషయంలో, విలీనాలు, డీమెర్జర్లు (వేరు చేయడం), గుంపగుత్తగా విక్రయించడంలో ప్రస్తుతం నిబంధనల పరంగా అంతరాలు ఉండడంతో అసోచామ్‌ ఇలా కోరింది. బైబ్యాక్‌ల రూపంలో వచి్చన దాన్ని డివిడెండ్‌గా పరిగణించాలని సూచించింది.

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)