Breaking News

ఏషియన్‌ పెయింట్స్‌ మిశ్రమ పనితీరు

Published on Fri, 10/27/2023 - 04:37

న్యూఢిల్లీ: ఏషియన్‌ పెంయింట్స్‌ సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి మిశ్రమ పనితీరు చూపించింది. నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.803 కోట్లతో పోల్చిచూసినప్పుడు 53 శాతం వృద్ధితో రూ.1,232 కోట్లకు దూసుకుపో యింది. ఆదాయం పెద్దగా మార్పు లేకుండా క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.8,430 కోట్ల నుంచి రూ.8,452 కోట్లకు వృద్ధి చెందింది. ప్రధానంగా ముడి సరుకుల ధరలు తగ్గడం, కార్యకలాపాల సామర్థ్యాలు మెరుగుపడడం లాభాలు పెరిగేందుకు దారితీసింది.

క్రితం ఏడాది ఇదే కాలంలో పోలి్చచూస్తే స్థూల మార్జిన్లు 7.7 శాతం మేర పెరిగాయి. మొత్తం వ్యయాలు 6 శాతం తగ్గి రూ.7,022 కోట్లుగా ఉన్నాయి. కోటింగ్స్, డెకరేటివ్, ఇండస్ట్రియల్‌ పెయింట్స్‌ ఆదాయంలో కేవలం ఒక శాతమే వృద్ధి నమోదైంది. నైరుతి రుతుపవనాల్లో అస్థిరతలు మార్కెట్‌ సెంటిమెంట్‌పై ప్రభావం చూపించినట్టు ఏషియన్‌ పెయింట్స్‌ తెలిపింది. ఫలితంగా కొనుగోళ్లు వాయిదా పడినట్టు పేర్కొంది. దేశీయ డెకరేటివ్‌ వ్యాపారం విలువ పరంగా 6 శాతం వృద్ధిని చూపించింది. అంతర్జాతీయ కార్యకలాపాల ద్వారా దాయం 4 శాతం తగ్గి రూ.775 కోట్లకు పరిమితమైంది.  

ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు బీఎస్‌ఈలో 3 శాతానికి పైగా తగ్గి రూ.2,958 వద్ద స్థిరపడింది. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)