Breaking News

లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను విక్రయించిన ముఖేష్‌ అంబానీ

Published on Wed, 08/09/2023 - 11:38

ఆసియాలో అత్యంత ధనవంతుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను విక్రయించారు. న్యూయార్క్‌లో ఉన్న తన విలాసవంతమైన 2BHK అపార్ట్‌మెంట్‌ను రూ. 74.53 కోట్లకు అమ్మేసినట్టు తెలుస్తోంది. ‍ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నివాస భవనంలో ‘యాంటిలియా’ లో ఉంటున్న అంబానీ  విదేశంలో ఖరీదైన  ఆస్తిని విక్రయించడం వార్తల్లో నిలిచింది. అయితే  ఎందుకు అమ్మారు,  ఎవరెవరి మధ్య ఈ డీల్‌ జరిగిందనే వివరాలు అందుబాటులో లేవు. (కేంద్రం కీలక నిర్ణయం: టీసీఎస్‌కు బంపర్‌ ఆఫర్‌)

న్యూయార్క్ పోస్ట్ తాజా నివేదిక ప్రకారం ముఖేష్ అంబానీ న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్‌లో తన విలాసవంతమైన కాండోస్‌లో ఒక దానిని రూ. 74.53 కోట్లకు (9 మిలియన్ డాలర్లు) విక్రయించారు. ఈ అపార్ట్‌మెంట్ 400 W. 12వ వీధిలోని నాల్గవ అంతస్తులో ఉంది, దీనిని సుపీరియర్ ఇంక్ అని కూడా పిలుస్తారు. రిలయన్స్‌ అధినేత విక్రయించిన అపార్ట్‌మెంట్‌ప్రముఖ హడ్సన్‌ నది ఒడ్డున, 3 బాత్‌రూమ్‌లు, కాండోలో 10-అడుగుల ఎత్తైన పైకప్పులు, నాయిస్ ప్రూఫ్ విండోస్, చెఫ్ కిచెన్ హెరింగ్‌బోన్ హార్డ్‌వుడ్ ఫ్లోర్‌లు ఉన్నాయి. ఈ భవనం 1919 నాటిదని, దీనిని గతంలో సుపీరియర్ ఇంక్ ఫ్యాక్టరీ అని పిలిచేవారట. 2,406 చదరపు అడుగుల విస్తీర్ణంలో అధునాతన సౌకర్యాలతో రెన్నోవేట్‌ 2009లో అమ్మకానికి వచ్చాయి. మార్క్ షటిల్‌వర్త్, లెస్లీ అలెగ్జాండర్, మార్క్ జాకబ్స్ మరియు ఇతరులతో సహా కొంతమంది  సెలబ్రిటీలు ఇందులో నివసిస్తున్నారు. (అమ్మకోసం...భళా బుడ్డోడా! వైరల్‌ వీడియో)

కాగా ముఖేష్ అంబానీ నివాసముండే ముంబైలోని యాంటిలియా ఖరీదు రూ. 15,000 కోట్లకు పైనే.దీంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా అనేక విలాసవంతమైన ఆస్తులను కలిగి ఉన్న సంగతి తెలిసిందే.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)