Breaking News

బుల్లెట్‌ రైలు ఎప్పుడు పట్టాలెక్కుతుందంటే..

Published on Fri, 03/22/2024 - 15:08

దేశంలో బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తాజాగా బుల్లెట్‌రైలు ప్రాజెక్టుకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. 2026 నాటికి ఈ రైలు పట్టాలెక్కుతుందని చెప్పారు. ‘రైజింగ్‌ భారత్‌ సమ్మిట్‌’లో పాల్గొన్న ఆయన ఈమేరకు వివరాలు వెల్లడించారు. 

‘బుల్లెట్‌ రైలు కోసం 500కి.మీల పొడవైన ప్రాజెక్టును నిర్మించేందుకు వివిధ దేశాలకు దాదాపు 20 సంవత్సరాలు పట్టింది. కానీ, భారత్‌ ప్రపంచ స్థాయి సౌకర్యాలతో 8-10 ఏళ్లలోనే పూర్తిచేయనుంది. 2026 నాటికి ఈ రైలు పట్టాలెక్కనుంది. మొదట గుజరాత్‌లోని సూరత్‌ నుంచి బిలిమోరా వరకు దీన్ని నడపనున్నాం. 2028 నాటికి ముంబయి-అహ్మదాబాద్‌ పూర్తి మార్గం అందుబాటులోకి రానుంది’ అని మంత్రి చెప్పారు. 

దేశంలోనే ఈ తొలి బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు కారిడార్‌ పొడవు 508.17 కిలోమీటర్లు. 251కి.మీ మేర పిల్లర్లు, 103 కి.మీ మేర ఎలివేటెడ్‌ సూపర్‌ స్ట్రక్చర్‌ నిర్మాణం జరిగిందనట్లు మంత్రి గతంలోనే చెప్పారు. ఈ రైలు సేవలు అందుబాటులోకి వస్తే కేవలం 2.58 గంటల్లో అహ్మదాబాద్‌ నుంచి ముంబయి చేరుకోవచ్చు. ఈ రైలు మార్గం ముంబై, థానే, వాపి, వడోదర, సూరత్, ఆనంద్, అహ్మదాబాద్‌లను కలుపుతుంది. ఇప్పటికే ప్రాజెక్ట్‌ పరిధిలో ఉన్న ఎనిమిది నదులపై వంతెనల నిర్మాణం పూర్తయినట్లు సమాచారం. ముంబై, థానే మధ్య సముద్రంలోని సొరంగం నిర్మాణం పనులు దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లు తెలిసింది.

ఇదీ చదవండి: రెండోపెళ్లి చేసుకున్న ఫుడ్‌ డెలివరీ సంస్థ సీఈవో

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)