Breaking News

‘ఇండస్‌ఇండ్‌లో వాటా పెంపునకు అనుకూల సమయం’

Published on Thu, 03/20/2025 - 09:11

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ స్టాక్‌ ధర ఇటీవల భారీగా పతనం కావడంతో ప్రమోటర్లు వాటాలు పెంచుకునేందుకు ఇది అనుకూల తరుణమని ఇండస్‌ఇండ్‌ ఇంటర్నేషనల్‌ హోల్డింగ్స్‌ (ఐఐహెచ్‌ఎల్‌) ఛైర్మన్‌ అశోక్‌ హిందుజా అన్నారు. హిందుజా గ్రూప్‌ పెట్టుబడుల సంస్థ ‘ఐఐహెచ్‌ఎల్‌’ ప్రస్తుతం ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌లో 16 శాతం వాటాతో ప్రమోటింగ్‌ సంస్థగా ఉంది. ఈ వాటాను 26 శాతానికి పెంచుకునేందుకు ఆర్‌బీఐ ఇటీవలే సూత్రప్రాయ ఆమోదం తెలపడం గమనార్హం.

బ్యాంక్‌ ఖాతాల్లో రూ.2,100 కోట్ల విలువ మేర వ్యత్యాసాలు ఉన్నాయంటూ ఇటీవలే వెలుగు చూడడం, అనంతరం సంస్థ నికర విలువ (నెట్‌వర్త్‌) తగ్గిపోవడం తెలిసిందే. అయినప్పటికీ ప్రమోటర్ల నుంచి బ్యాంక్‌ నిధుల సాయం కోరలేదని అశోక్‌ హిందుజా తెలిపారు. అవసరమైతే బ్యాంక్‌కు నిధులు అందించేందుకు కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. బ్యాంక్‌ క్యాపిటల్‌ అడెక్వెసీ 15 శాతానికి పైన సౌకర్యంగానే ఉందన్నారు. ఈ ధరలో తాను మాత్రమే కాదని, ఏ వాటాదారుడు అయినా వాటా పెంచుకోవాలనే అనుకుంటారని వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి: తాజా ఆటోమొబైల్‌ అప్‌డేట్స్‌

బ్యాంక్‌ ఖాతాల్లో వ్యత్యాసంపై వాస్తవాలను తేల్చేందుకు ఆడిటింగ్‌ సంస్థకు బాధ్యతలు అప్పగించగా, మార్చి నెలాఖరుకు అది రానున్నది. పీడబ్ల్యూసీ ఆడిటింగ్‌ నివేదికతో ఖాతాల్లో వ్యత్యాసానికి ఎవరు బాధ్యులన్నది తేలుతుందని అశోక్‌ హిందుజా అన్నారు. సీఎఫ్‌వో పదవి నుంచి గోదింద్‌జైన్‌ తప్పుకోవడం వెనుక కారణాలపై మీడియా ప్రశ్నించగా, వ్యాఖ్యానించడానికి నిరాకరించారు.
 

#

Tags : 1

Videos

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

ఆసియా గేమ్స్ మహిళల కబడ్డీలో భారత్ కు స్వర్ణం

ఇది కచ్చితంగా ప్రభుత్వ హత్యే... కాకుమానుపై పోలీసుల తీరు.. అడ్వకేట్ రజినీ షాకింగ్ నిజాలు

ఛలో విజయవాడలో ఉద్రికత్త.. పోలీసుల జులుం.. మహిళకు గాయాలు

తొక్కేదాం అని చూసారు.. కానీ కలెక్షన్స్ తో తుక్కు రేగోడుతున్నాడు

FBI పేరుతో అకౌంట్లు బ్లాక్ చేసి.. ఇన్ఫ్లు యెన్సర్లకు 15 వేలు.. కారుమూరి సంచలన నిజాలు

జగన్, చంద్రబాబుల గురించి ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నా..

Photos

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)