Breaking News

ఎప్రిలియా కొత్త బైక్: ధర ఎంతంటే?

Published on Sun, 06/21/2026 - 20:41

ఎప్రిలియా ఇండియా.. టుయోనో 457 స్పెషల్ ఎడిషన్‌ను దేశీయ విఫణిలో లాంచ్ చేసింది. దీని ధర రూ.3.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ కోసం ఎంపిక చేసిన షోరూమ్‌లలో బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి.

కొత్త ఎప్రిలియా టుయోనో 457 స్పెషల్ ఎడిషన్‌  2006 ట్యూనో 1000R నుంచి తీసుకున్న రెండు కొత్త లివరీలను పొందింది. అంతేకాకుండా.. ఈ మోటార్‌సైకిల్‌లో కొన్ని ఎర్గోనామిక్ మార్పులు కూడా చేసినట్లు తెలుస్తోంది.

స్పెషల్ ఎడిషన్ టుయోనో 457, కొత్త గ్రాఫిక్స్ డిజైన్, లోగోలతో పాటు, మాంబా బ్లాక్ అండ్ పూమా గ్రే అనే రెండు కొత్త రంగులలో లభిస్తుంది. కొత్త స్మోక్డ్ ఫినిష్ ఏరోడైనమిక్ ఫ్లైస్క్రీన్, నిటారుగా ఉండే రైడింగ్ పొజిషన్ కోసం ఎత్తుగా అమర్చిన హ్యాండిల్‌బార్లు ఉన్నాయి. సుదూర ప్రయాణాలలో మరింత సౌకర్యం కోసం ఈ స్పెషల్ ఎడిషన్ సీటులో మార్పులు చేశారని, అలాగే భారతీయ రోడ్లపై మెరుగ్గా పనిచేసేలా సస్పెన్షన్‌ను కూడా మెరుగుపరిచినట్లు ఎప్రిలియా చెబుతోంది.

ఇంజిన్ విషయానికి వస్తే.. ఎప్రిలియా పవర్‌ప్లాంట్‌లో ఎటువంటి మార్పు చేయలేదు. కాబట్టి టుయోనో 457 బైక్ 46.9 bhp పవర్, 43.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే 457 సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజిన్‌తో కొనసాగుతోంది.

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)