Breaking News

యాపిల్‌ ఈవెంట్‌కు డేట్‌ ఫిక్స్‌

Published on Tue, 08/27/2024 - 09:28

ప్రపంచ దిగ్గజ కంపెనీ యాపిల్‌ ఏటా నిర్వహించే ‘యాపిల్‌ ఈవెంట్‌’ తేదీని ప్రకటించింది. ముందుగా ఈ ఈవెంట్‌ను సెప్టెంబర్‌ 10న నిర్వహించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఒకరోజు ముందే అంటే సెప్టెంబర్‌ 9న యాపిల్‌ ఈవెంట్‌ జరుపుతామని ప్రకటించారు. కాలిఫోర్నియాలోని స్టీవ్‌ జాబ్స్‌ థియేటర్‌ ఈ కార్యక్రమానికి వేదిక కానుంది.

యాపిల్‌ కంపెనీ ఈ ఈవెంట్‌లో తమ సంస్థ కొత్త ఉత్పత్తులు, వాటి ఫీచర్లకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తారు. ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ దిగ్గజ కంపెనీ ఎలాంటి టెక్నాలజీపై పనిచేస్తుందో ఇతర కంపెనీలు ఒక అంచనాకు వస్తాయి. అందుకు తగ్గట్టుగా ఆయా సంస్థలు తమ ఉత్పత్తుల్లో మార్పులు చేర్పులు చేస్తుంటాయి. అందుకే ఈ ఈవెంట్‌కు చాలా ఆదరణ ఉంటుంది. ఈ కార్యక్రమంలో ఐఫోన్‌ 16 సిరీస్‌ను లాంచ్‌ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏటా సెప్టెంబర్‌ రెండో వారంలో యాపిల్‌ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. గతేడాది సెప్టెంబర్‌ 12న కాలిఫోర్నియా వేదికగా ఈ కార్యక్రమాన్ని జరిపారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ 10న దీన్ని ఏర్పాటు చేయాలని ముందుగా ప్రతిపాదించినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఒకరోజు ముందే సెప్టెంబర్‌ 9న ఈ ఈవెంట్‌ను జరుపుతున్నట్లు ప్రకటించారు.

ఇదీ చదవండి: టెలిగ్రామ్‌ను నిషేధిస్తారా..? సీఈఓ అరెస్టు!

ఈ కార్యక్రమంలో యాపిల్‌ ఐఫోన్‌ 16 సిరీస్‌, యాపిల్‌ వాచ్‌, మ్యాక్‌బుక్‌, ఎయిర్‌పాడ్స్‌లో కొత్త ఫీచర్లు, రాబోయే మార్పుల గుర్తించి తెలియజేసే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదిలాఉండగా, ఈ ఈవెంట్‌కు ‘ఇట్స్‌ గ్లోటైమ్‌’ అనే ట్యాగ్‌ లైన్‌ను జత చేశారు. దాంతో ఈ కార్యక్రమంపై అంచనాలు పెరుగుతున్నాయి.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)