లాంచ్‌కు సిద్దమవుతున్న యాపిల్ విజన్​ ప్రో - ధర రూ.2.90 లక్షలు

Published on Mon, 01/08/2024 - 14:29

భారతీయ మార్కెట్లో యాపిల్ ఉత్పత్తులకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని సంస్థ త్వరలో వర్చ్యువల్​ రియాల్టీ హెడ్​సెట్​ 'విజన్​ ప్రో' (Vision Pro) లాంచ్​ చేయడానికి సిద్ధమవుతోంది. యాపిల్ సంస్థ లాంచ్ చేయనున్న ఈ కొత్త హెడ్​సెట్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

బ్లూమ్‌బెర్గ్ నివేదికల ప్రకారం, యాపిల్ కంపెనీ తన వర్చ్యువల్​ రియాల్టీ హెడ్​సెట్​ను లాంచ్ చేయడానికంటే ముందు రిటైల్ స్టోర్‌లకు పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది ఫిబ్రవరిలో అధికారికంగా లాంచ్ అయిన తరువాత డెలివరీలు ప్రారంభమవుతాయని సమాచారం.

యాపిల్ సంస్థ ఈ విజన్​ ప్రో హెడ్​సెట్ సేల్స్ కోసం ఉద్యోగులకు ప్రత్యేకమైన శిక్షణ కూడా అందిస్తున్నట్లు తెలుస్తోంది. కాబట్టి డెలివరీలు ప్రారంభమయ్యే సమయంలో శిక్షణ పొందిన ఉద్యోగులు రిటైల్ స్టోర్ల వద్ద ఇద్దరు లేదా ముగ్గురు ఉండే అవకాశం ఉంది. వారు కొనుగోలుదారులకు హెడ్​సెట్‌కు సంబంధించిన విషయాలను వెల్లడిస్తారు.

ధర (Price)
2023 WWDC ఈవెంట్‌లో మొదటి సారి కనిపించిన యాపిల్ విజన్​ ప్రో ఫిబ్రవరిలో లాంచ్ అవుతుందని చాలామంది విశ్వసిస్తున్నారు. ఈ హెడ్​సెట్​లో ఎమ్2 చిప్ సెట్, రెండు హై-రిజల్యూషన్ 4K ఐపీస్‌ వంటివి ఉంటాయి. దీని ధర 3499 డాలర్ల వరకు ఉంటుందని సమాచారం. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం రూ.2.90 లక్షల వరకు ఉంటుంది. ఇందులో ఎక్స్​టర్నల్​ బ్యాటరీ ప్యాక్​ కూడా ఉంటుంది.

ఇదీ చదవండి: ట్రెండ్‌ మార్చిన వర్కింగ్‌ ఉమెన్స్‌.. బంగారంపై తగ్గిన ఇంట్రెస్ట్‌

ఈ లేటెస్ట్ హెడ్​సెట్​తో వర్చ్యువల్​ రియాల్టీ అనుభూతిని పొందే అవకాశం ఉంటుంది. ఇది మొదట కేవలం అమెరికాలో మాత్రమే అమ్మకానికి అందుబాటులో ఉండనుంది. ఆ తరువాత చైనా, కెనడా, యూకే వంటి దేశాల్లో విక్రయాలు ఉంటాయి. అయితే భారతదేశంలో ఈ హెడ్​సెట్ ఇండియాలో లాంచ్ అవుతుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)