Breaking News

భారత్‌లో యాపిల్‌ నాలుగు స్టోర్లు..? ఎక్కడంటే..

Published on Fri, 10/04/2024 - 13:36

ప్రపంచ దిగ్గజ సంస్థ యాపిల్‌ భారత్‌లో తన రిటైల్‌ స్టోర్‌లను విస్తరించాలని యోచిస్తోంది. ఇప్పటికే ఢిల్లీ, ముంబయిలో రిటైల్‌ స్టోర్‌లను ప్రారంభించిన యాపిల్‌ మరో నాలుగు అవుట్‌లెట్లను ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.

ప్రపంచవ్యాప్తంగా యాపిల్‌ ఉత్పత్తులకు భారీగా డిమాండ్‌ ఏర్పడుతుంది. అందుకు అనుగుణంగా ఉత్పాదకతను పెంచేలా కంపెనీ ఏర్పాట్లు చేస్తోంది. దేశీయంగా యాపిల్‌ ఉత్పత్తుల తయారీ కోసం ఫాక్స్‌కాన్‌, టాటా వంటి కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. సెప్టెంబర్‌ 20న యాపిల్‌ ఐఫోన్‌ 16 సిరీస్‌ విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. దాంతో దేశంలోని ముంబయి, ఢిల్లీ స్టోర్‌ల్లో భారీగా వినియోగదారుల రద్దీ నెలకొంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థను ఆసరాగా చేసుకుని కంపెనీ రెవెన్యూ పెంచుకోవాలని ఆశిస్తుంది. దేశంలో కొత్తగా బెంగళూరు, పుణె, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, ముంబయిలో రిటైల్‌ స్టోర్‌లు ప్రారంభించాలని యోచిస్తోంది. దాంతోపాటు ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’లో భాగంగా ఐఫోన్‌ 16 ప్రో, ఐఫోన్‌ 16 ప్రో మ్యాక్స్‌ను స్థానికంగా తయారు చేయాలనే ప్రతిపాదనలున్నట్లు కంపెనీ అధికారులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: కేంద్రం కొత్త పథకాలు ప్రారంభం.. ఎవరికంటే..

ఆపిల్ రిటైల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డెయిడ్రే ఓబ్రియన్ మాట్లాడుతూ..‘భారత్‌లో సంస్థ రిటైల్‌ స్టోర్‌లు విస్తరించాలని యోచిస్తోంది. అందుకు అనుగుణంగా మెరుగైన టీమ్‌ను సిద్ధం చేస్తున్నాం. మా కస్టమర్ల సృజనాత్మకత, అభిరుచికి అధిక ప్రాధాన్యం ఇస్తాం. వారి ఇష్టాలకు అనువుగా సరైన ఉత్పత్తులను అందించడం సంస్థ బాధ్యత. స్థానికంగా స్టోర్లను పెంచడం ద్వారా మరింత ఎక్కువ మంది వినియోగదారులకు సేవలందించే అవకాశం ఉంటుంది’ అన్నారు.

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య