Breaking News

భారత్‌లో యాపిల్‌ కొత్తగా నాలుగు అవుట్‌లెట్లు!

Published on Fri, 11/01/2024 - 13:26

ప్రపంచ దిగ్గజ కంపెనీ యాపిల్‌ భారత్‌లో నాలుగు అవుట్‌లెట్లను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కంపెనీ సీఈఓ టిమ్‌కుక్‌ తెలిపారు. భారత్‌లో యాపిల్‌ ఉత్పత్తుల విక్రయాలు పెరుగుతున్నట్లు చెప్పారు. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రెవెన్యూ గతంలో కంటే 6 శాతం పెరిగి 94.9 బిలియన్‌ డాలర్ల(రూ.7.9 లక్షల కోట్లు)కు చేరిందని తెలిపారు.

ఈ సందర్భంగా యాపిల్‌ సీఈఓ టిమ్‌కుక్‌ ముదుపర్లను ఉద్దేశించి మాట్లాడారు. ‘యాపిల్ తాజా త్రైమాసిక ఫలితాల్లో రికార్డు స్థాయి ఆదాయాన్ని నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా భారీగా ఐఫోన్ అమ్మకాలు జరిగాయి. భారతదేశంలో యాపిల్‌ సేల్స్‌ గరిష్ఠాలను చేరుకున్నాయి. ఇండియాలో కంపెనీ కార్యకలాపాలు మరింత విస్తరించేందుకు చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే దేశంలో ముంబయి, ఢిల్లీలో రెండు అవుట్‌లెట్లను ఏర్పాటు చేశాం. రానున్న రోజుల్లో మరో నాలుగు అవుట్‌లెట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. దీంతో కంపెనీ రెవెన్యూ మరింత పెరిగే అవకాశం ఉంది’ అన్నారు.

ఇదీ చదవండి: చాట్‌జీపీటీ కొత్త ఆప్షన్‌.. గూగుల్‌కు పోటీ ఇవ్వనుందా?

మంబయిలో యాపిల్‌ బీకేసీ, ఢిల్లీలో యాపిల్‌ సాకెత్‌ పేరుతో రెండు అవుట్‌లెట్లను గతంలో ప్రారంభించింది. బెంగళూరు, పుణె, ముంబయి, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ల్లో మరో నాలుగు కొత్త స్టోర్‌లను ప్రారంభించే యోచనతో ఉన్నట్లు గతంలో ప్రతిపాదించింది. తాజాగా కంపెనీ సీఈఓ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించడం గమనార్హం. ఇటీవల కంపెనీ ఐఫోన్‌ 16 సిరీస్‌ను ఆవిష్కరించింది. వారం కిందట యాపిల్‌ ఐఓఎస్‌ 18.1ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో వినియోగదారులకు వినూత్న ఫీచర్లను అందించినట్లు కంపెనీ తెలిపింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)