Breaking News

ఐఫోన్ కొనేందుకు ఇది మంచి సమయం!

Published on Sun, 07/05/2026 - 17:08

అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా.. యాపిల్ ఐఫోన్ 16పై భారీ ధర తగ్గింపును ప్రకటించారు. ప్రారంభంలో రూ.79,900 ధరతో విడుదలైన 128GB వేరియంట్ ఇప్పుడు రూ.62,900కే అందుబాటులో ఉంది. అంటే వినియోగదారులకు నేరుగా రూ.17,000 వరకు తగ్గింపు లభిస్తోందన్నమాట. అంతేకాకుండా.. అర్హత కలిగిన క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే అమెజాన్ పే క్యాష్‌బ్యాక్ రూపంలో రూ.3,145 వరకు తిరిగి పొందే అవకాశం ఉంది. దీంతో ఈ ఫోన్ రూ.59,755లకు లభిస్తుంది.

ఈ సేల్‌లో అమెజాన్.. ఐఫోన్ 16పై సుమారు 21 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. అదనంగా ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులు, ఎస్‌బీఐ డెబిట్ కార్డులపై రూ.1,750 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంతే కాకుండా.. పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌చేంజ్ చేస్తే, దాని మోడల్, కండిషన్లను బట్టి గరిష్టంగా రూ.41,050 వరకు ఎక్స్‌చేంజ్ విలువ పొందే అవకాశం ఉంది. దీంతో కొత్త ఐఫోన్‌ను మరింత తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.

ఈ ఆఫర్‌ను పొందాలంటే అర్హత కలిగిన క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేయాలి. క్యాష్‌బ్యాక్ మొత్తం కొనుగోలు పూర్తైన తర్వాత అమెజాన్ పే బ్యాలెన్స్ రూపంలో జమ అవుతుంది. ఒకవేళ వినియోగదారుల వద్ద పాత స్మార్ట్‌ఫోన్ ఉంటే, ఎక్స్‌చేంజ్ ఆఫర్‌ను కూడా కలిపి మరింత ఆదా చేసుకోవచ్చు. అలాగే ఒకేసారి మొత్తం చెల్లించలేని వారు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు.

ఫీచర్ల విషయానికి వస్తే.. ఐఫోన్ 16లో 6.1 అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లే ఉంటుంది. ఇందులో యాపిల్ A18 చిప్‌సెట్ ఉండటంతో వేగవంతమైన పనితీరు లభిస్తుంది. యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లకు కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఫోటోగ్రఫీ కోసం 48 మెగాపిక్సెల్ ఫ్యూజన్ మెయిన్ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12 మెగాపిక్సెల్ ట్రూడెప్త్ ఫ్రంట్ కెమెరాను అందించారు.

ఇంకా ఈ స్మార్ట్‌ఫోన్ 5G కనెక్టివిటీ, USB టైప్-సీ పోర్ట్, IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్, మ్యాగ్‌సేఫ్ వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ఆధునిక ఫీచర్లతో వస్తుంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే గరిష్టంగా 22 గంటల వీడియో ప్లేబ్యాక్ అందుతుందని యాపిల్ పేర్కొంది. మొత్తం మీద అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో లభిస్తున్న భారీ తగ్గింపులు, క్యాష్‌బ్యాక్, ఎక్స్‌చేంజ్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ వంటి ప్రయోజనాలతో ఐఫోన్ 16 కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం.

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)