Breaking News

భారత తొలి ఆపిల్‌ స్టోర్‌పై కోవిడ్‌-19 దెబ్బ..!

Published on Sun, 08/08/2021 - 15:24

ఆపిల్‌ కంపెనీకి చెందిన ఐఫోన్‌కు క్రేజ్‌ మామూలుగా ఉండదు.సెక్యూరిటీ విషయంలో ఇతర మొబైల్‌ ఫోన్లతో పోలిస్తే ఆపిల్‌ ఐఫోన్‌కు పోటి అసలు ఉండదు. ఐఫోన్‌ను చాలా మంది వినియోగించడానికి ప్రధాన కారణం భద్రత. ఆపిల్‌ తన వినియోగదారుల ప్రైవసీ,భద్రత విషయంలో అసలు రాజీ పడదు. భారత మార్కెట్లలో ఆపిల్‌ స్మార్ట్‌ఫోన్లకు ఉన్న ఆదరణ అంతాఇంతా కాదు. భారత మార్కెట్లను దృష్టిలో ఉంచుకొని ఆపిల్‌ అధికారిక ఆన్‌లైన్‌ స్టోర్‌ను 2020 సెప్టెంబర్‌ నెలలో ప్రారంభించింది.

ఆపిల్‌ తన తొలి  అధికారిక ఫిజికల్‌ రిటైల్‌ స్టోర్‌ను ముంబైలో ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌-19 రాకతో భారత్‌లో ఫిజికల్‌ రిటైల్‌ స్టోర్‌ను ఏర్పాటు చేయడంలో నీలినీడలు కమ్ముకున్నాయి. ఆపిల్‌ తొలి ఫిజికల్‌ రిటైల్‌ స్టోర్ ఏర్పాటు ఆలస్యమయ్యేలా ఉన్నట్లు తెలుస్తోంది. ఆపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ గత ఏడాది 2021 నుంచి భారత్‌లో ఆపిల్‌ తన తొలి ఫిజికల్‌స్టోర్‌ను తెరవనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా భారత రిటైల్‌ రంగంలో ఆపిల్‌ తన స్థానిక ఉనికిని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు కూడా పేర్కొన్నారు. 

ప్రస్తుతం ఆపిల్‌ తన పరికరాలను ప్రాంచైజ్‌ రిటైల్‌ నెట్‌వర్క్‌ కింద పనిచేసే పంపిణీదారుల ద్వారా దేశంలో విక్రయిస్తోంది. ఆప్‌ట్రాన్సిక్స్‌ వంటి ఫ్రాంచైజ్‌లతో ఆపిల్‌ తన భాగస్వామ్యాన్ని కొనసాగిస్తుంది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఆపిల్‌ రెండంకెల వృద్ధితో రికార్డు స్థాయిలో ఆదాయాన్ని నమోదుచేసింది. ఆపిల్‌ టర్నోవర్‌ 36 శాతం అధికమై రూ.6,05,616 కోట్లు సాధించినట్టు సంస్థ సీఈవో టిమ్‌ కుక్‌ వెల్లడించారు. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.4.43 లక్షల కోట్లుగా ఉంది. నికరలాభం రూ.83,328 కోట్ల నుంచి రూ.1,61,448 కోట్లకు చేరింది. ఏ దేశం నుంచి ఎంత మొత్తం ఆదాయం సమకూరింది వంటి వివరాలను కంపెనీ వెల్లడించలేదు.

Videos

తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా

పిఠాపురం నియోజకవర్గంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ హెల్త్ సెక్రటరీ

ఆవకాయ కోసం యూరప్ నుంచి ఇండియాకు వచ్చిన విదేశీయులు

మా కుటుంబాన్ని మొత్తం రోడ్డున పడేసాడు.. రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్ ఫైర్..

కూటమి ప్రభుత్వంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర ఆగ్రహం

కూటమి ప్రభుత్వంపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్

సిరాజ్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చిన ప్రత్యేక కోర్టు

Pithapuram: పవన్ ఇలాకాలో మట్టి మాఫియా

సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు

Major Encounter: భారీ ఎన్‌కౌంటర్లో 25 మంది మృతి.. మరికొందరికి గాయాలు

Photos

+5

కేన్స్‌లో అదితి ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా మురిపించింది (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )

+5

మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)