Breaking News

యాపిల్‌ కొత్త ఓఎస్‌ గురించి తెలుసా..?

Published on Sat, 06/07/2025 - 13:52

ప్రపంచ టెక్ దిగ్గజం యాపిల్ డబ్ల్యూడబ్ల్యూడీసీ 2025లో ‘హోమ్ఓఎస్’ పేరుతో సరికొత్త స్మార్ట్ హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ప్రారంభించనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఐఫోన్ కోసం ఐఓఎస్, యాపిల్ వాచ్ కోసం వాచ్ఓఎస్, ఐప్యాడ్ కోసం ఐప్యాడ్ఓఎస్ వంటి ఎకోసిస్టమ్ పరికరాలకు ప్రత్యేకంగా యాపిల్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందించింది. ఇదే తరహాలో ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టం యాపిల్ స్మార్ట్ హోమ్ డివైజ్‌లకు ఉపయోగకరంగా మారనుందని చెబుతున్నారు.

హోమ్‌ఓఎస్‌లోని ఫీచర్లు ఇలా..

కస్టమైజబుల్ హోమ్ స్క్రీన్: ఐఓఎస్ మాదిరిగానే వినియోగదారులు వాతావరణం, స్టాక్స్, రిమైండర్లు.. వంటివాటి కోసం విడ్జెట్లను జోడించవచ్చు.

స్మార్ట్ హోమ్ కంట్రోల్స్: హోమ్ యాప్ ద్వారా లైట్లు, సెక్యూరిటీ, క్లైమేట్ ఇతర యాక్ససరీలను సులభంగా నిర్వహించవచ్చు.

సిరి, యాపిల్‌ ఇంటెలిజెన్స్: సందర్భానికి తగినట్లు లోతైన అవగాహనతో మెరుగైన వాయిస్ కంట్రోల్‌తో చర్యలు తీసుకోవడానికి సిరిని అనుమతిస్తుంది.

హోమ్ ఆటోమేషన్: నిద్రపోతున్న సమయంలో తలుపులకు తాళం వేయడం, సాయంత్రం అయితే లైట్లు ఆన్ చేయడం లేదా ఇంట్లోకి వచ్చే ముందు మీ ఇంట్లోని ఏసీ, వాషింగ్‌ మిషన్‌.. ఇతరత్రా ఎలక్ట్రానిక్‌ వస్తువులను రిమోట్‌గా నిర్వహించడం.

డైనమిక్ రెస్పాన్సిబిలిటీ: సిస్టమ్‌ యూజర్ ప్రాక్సిమిటీ ఆధారంగా పని చేసేలా ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఇంటి​కి దూరంగా ఉన్నప్పుడు విడ్జెట్‌లు లేదా ఫొటోలను ప్రదర్శించడం ద్వారా వాటిని రిమోట్‌గానే నిర్వహించవచ్చు. సమీపంలో ఉన్నప్పుడు హోమ్ స్క్రీన్‌ను ఉపయోగించవచ్చు.

#

Tags : 1

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)