Breaking News

యాపిల్‌కు రూ.1.29 లక్షల జరిమానా

Published on Mon, 09/30/2024 - 13:41

ప్రముఖ మొబైల్ దిగ్గజం యాపిల్‌కు కాకినాడ వినియోగదారుల కమిషన్ జరిమానా విధించింది. ఇంతకీ ఈ కంపెనీకి ఎందుకు జరిమానా విధించారు, ఎంత జరిమానా విధించారు? అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

ఐఫోన్ 12 మొబైల్ కొనుగోలు చేస్తే.. హెడ్‌ఫోన్స్‌ ఉచితం అనే ప్రకటన చూసి 2021లో చందలాడ పద్మరాజు మొబైల్ బుక్ చేసుకున్నారు. కానీ డెలివరీలో తనకు హెడ్‌ఫోన్స్‌ డెలివరీ కాలేదు. ఈ విషయం మీద యాపిల్‌ సంస్థ ప్రతినిధులను, కస్టమర్‌ కేర్‌లను ఆన్‌లైన్‌లో సంప్రదించారు. ఎప్పటికీ వారి నుంచి సరైన స్పందన రాలేదు.

యాపిల్ సంస్థ తన గోడును పట్టించుకోకపోవడంతో 2022లో వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. తాను చూసిన ప్రకటనలకు సంబంధించిన ఆధారాలను కోర్టుకు సమర్పించారు. ఫిర్యాదుదారుని వాదనలు..సాక్ష్యాలు పరిశీలించి యాపిల్ సంస్ధకు రూ. 1,29,900 జరిమాన విధించింది.

ఇదీ చదవండి: ఉద్యోగాల సృష్టికి ఏం చేయాలంటే?.. రఘురామ్ రాజన్

హెడ్‌ఫోన్స్‌కు రూ.14,900, బాధితుని మానసిక క్షోభకు రూ.10,000, కోర్టు ఖర్చులకు రూ.5,000 జరిమాన విధించింది. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలను వెల్లడించించినందుకు రూ. 1 లక్ష జరిమానా విధిస్తూ.. ఆ మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిష్టర్ రిలీఫ్ ఫండ్‌కు చెల్లించాలని కమిషన్ తీర్పునిచ్చింది.

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)