Breaking News

కస్టమర్లకు భారీ పరిహారం చెల్లిస్తున్న యాపిల్‌.. ఎందుకంటే..

Published on Sun, 08/04/2024 - 18:35

ప్రీమియం మొబైల్స్‌, ల్యాప్‌టాప్‌ల తయారీ సంస్థ యాపిల్‌ తమ మ్యాక్‌బుక్‌ కస్టమర్లకు భారీగా పరిహారం చెల్లిస్తోంది. మ్యాక్‌బుక్‌ ల్యాప్‌టాప్‌లలో బటర్‌ఫ్లై కీబోర్డ్‌లతో సమస్యలను ఎదుర్కొన్న కస్టమర్లకు పరిహారం చెల్లించే ప్రక్రియను ప్రారంభించింది.

ఈ చర్య 2018లో దాఖలు చేసిన క్లాస్ యాక్షన్ దావా తర్వాత 2022లో టెక్ దిగ్గజం అంగీకరించిన 50 మిలియన్‌ డాలర్ల సెటిల్‌మెంట్‌లో భాగం. మ్యాక్‌బుక్‌లలో ఈ బటర్‌ఫ్లై కీబోర్డు పనిచేయడం లేదంటూ కొంత కస్టమర్లు ఈ దావా వేశారు.

బటర్‌ఫ్లై కీబోర్డ్‌ను యాపిల్ మొదటిసారిగా 2015లో కొత్త 12-అంగుళాల మ్యాక్‌బుక్‌లో పరిచయం చేసింది. తర్వాత 2016లో మ్యాక్‌బుక్ ప్రో,  2018లో మ్యాక్‌బుక్ ఎయిర్‌లకు దీన్ని విస్తరించింది. అయితే, స్టిక్కీ కీలు, డూప్లికేట్ క్యారెక్టర్స్‌, కొన్ని అక్షరాలు పూర్తిగా టైప్ కాకపోవడం వంటి సమస్యలు తలెత్తడంతో ఈ డిజైన్ విమర్శలను ఎదుర్కొంది. దీంతో యాపిల్ 2019 చివరిలో ఈ బటర్‌ఫ్లై కీబోర్డ్ డిజైన్‌ను దశలవారీగా నిలిపివేయడం ప్రారంభించింది.

సెటిల్‌మెంట్ కోసం దావా ప్రక్రియ 2022 చివరిలో ప్రారంభమైంది గతేడాది మేలో తుది ఆమోదం పొందింది. అయితే, కాలిఫోర్నియా , ఇల్లినాయిస్, ఫ్లోరిడా, మిచిగాన్, న్యూజెర్సీ, న్యూయార్క్, వాషింగ్టన్ నివాసితులు మాత్రమే ఈ సెటిల్‌మెంట్‌ను క్లెయిమ్ చేయడానికి అర్హులు.

కీబోర్డ్ సమస్యల తీవ్రతను బట్టి పరిహారం మొత్తం మారుతుంది. రెండు లేదా అంతకంటే ఎక్కువ టాప్ కేస్ రీప్లేస్‌మెంట్‌లు ఉంటే 395 డాలర్లు (రూ.33,000) వరకు పరిహారం పొందగలరు. అదే ఒక టాప్ కేస్ రీప్లేస్‌మెంట్ ఉన్నవారు 125 డాలర్లు (10,000) వరకు పొందవచ్చు. కీక్యాప్ రీప్లేస్‌మెంట్‌లు మాత్రమే అవసరమయ్యే వారు గరిష్టంగా 50 డాలర్లు పొందడానికి అర్హులు. జూన్ 27న కోర్టు ద్వారా చెల్లింపు ఆర్డర్ జారీ అయంది. ఆగస్టు 3 నుంచి చెల్లింపులు ప్రారంభమయ్యాయి.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)