Breaking News

ఫారెక్స్‌ @ రికార్డుకు మరో 50 బిలియన్‌ డాలర్ల దూరంలో..!

Published on Sat, 07/08/2023 - 06:03

ముంబై: భారత్‌ విదేశీ మారకద్రవ్య నిల్వలు (ఫారెక్స్‌) జూన్‌ 30వ తేదీతో ముగిసిన వారంలో అంతక్రితం ఇదే వారంతో (జూన్‌ 23వ తేదీ) పోల్చి చూస్తే.. 1.85 బిలియన్‌ డాలర్లు పెరిగి 595.051 బిలియన్‌ డాలర్లకు ఎగశాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తాజా గణాంకాలను విడుదల చేసిన గణాంకాల ప్రకారం రికార్డు స్థాయికి మరో 50 బిలియన్‌ డాలర్ల దూరానికి ఫారెక్స్‌ నిల్వలు చేరాయి.

2021 అక్టోబర్‌లో ఫారెక్స్‌ నిల్వలు ఆల్‌టైమ్‌ రికార్డు 645 బిలియన్‌ డాలర్లను తాకాయి. రూపాయి పతన నివారణకు చర్యలుసహా ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు ఆర్‌బీఐ తీసుకున్న పలు చర్యల నేపథ్యంలో రికార్డు స్థాయి నుంచి 100 బిలియన్‌ డాలర్లు కిందకు దిగాయి. తిరిగి మళ్లీ పురోగమన బాటన పయనిస్తున్నాయి. నెల రోజుల నుంచి నిలకడగా 595 డాలర్ల వద్ద కొంచెం అటు ఇటుగా కొనసాగుతున్నాయి.  ప్రస్తుత ఫారెక్స్‌ నిల్వలు దేశ దాదాపు 12 నెలల దిగుమతులకు సరిపోతాయని అంచనా. నిల్వలను వేర్వేరుగా చూస్తే..

► డాలర్ల రూపంలో పేర్కొనే ఫారిన్‌ కరెన్సీ అసెట్స్‌ 2.5 బిలియన్‌ డాలర్లు పెరిగి 527.97 బిలియన్‌ డాలర్లకు చేరింది.
► పసిడి నిల్వల విలువ 472 మిలియన్‌ డాలర్లు తగ్గి, 43.83 బిలియన్‌ డాలర్లకు తగ్గింది.
► ఇక అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) వద్ద స్పెషల్‌ డ్రాయింగ్‌ రైట్స్‌ (ఎస్‌డీఆర్‌) విలువ కూడా 95 మిలియన్‌ డాలర్లు తగ్గి 18.23 బిలియన్‌ డాలర్లకు చేరింది.
► ఐఎంఎఫ్‌ రిజర్వ్‌ పరిమాణా కూడా 118 మిలియన్‌ డాలర్ల తగ్గి 5 బిలియన్‌ డాలర్లకు పడింది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)