అప్పుల్లో ఉన్నా అస్సలు తగ్గని అనిల్ అంబానీ.. కొత్త కారులో

Published on Tue, 05/28/2024 - 13:41

భారతదేశంలోని అత్యంత సంపన్నులైన ముఖేష్ అంబానీ తన రెండో కొడుకు ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా జరపడానికి సిద్ధమయ్యారు. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ-వెడ్డింగ్ బాష్‌ 29 మే నుంచి జూన్ 1 మధ్య జరుగుతుంది. కుటుంబ సభ్యులు ఇప్పటికే ఇటలీకి బయలుదేరారు. తాజాగా ముఖేష్ అంబానీ సోదరుడు 'అనిల్ అంబానీ' బీవైడీ సీల్ ఎలక్ట్రిక్ కారులో విమానాశ్రయంలో కనిపించారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో అనిల్ అంబానీ బీవైడీ సీల్ ఎలక్ట్రిక్ కారులో నుంచి దిగటం చూడవచ్చు. కారు నుంచి బయటకు వచ్చిన తరువాత ఫోటోగ్రాఫర్‌ల వైపు కూడా చూడకుండా ముంబైలోని కలీనా విమానాశ్రయంలోకి వెళ్లారు. కారు రిజిస్ట్రేషన్ నెంబర్ ప్రకారం ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ పేరుతో రిజిస్టర్ చేసినట్లు తెలుస్తోంది. కాబట్టి ఇది అనిల్ అంబానీ కొనుగోలు చేశారా అని పలువురు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.

బీవైడీ ఎలక్ట్రిక్ కారు డైనమిక్, ప్రీమియం, పర్ఫామెన్స్ అనే మూడు వేరియంట్లలో.. ఆర్కిటిక్ బ్లూ, అరోరా వైట్, అట్లాంటిస్ గ్రే, కాస్మోస్ బ్లాక్ అనే నాలుగు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. అనిల్ అంబానీ కనిపించిన కారు ప్రీమియం వేరియంట్ అని తెలుస్తోంది.

బీవైడీ సీల్ ఎలక్ట్రిక్ కారు 61.44 కిలోవాట్, 82.56 కిలోవాట్ బ్యాటరీ ఫ్యాక్ ఆప్షన్స్ పొందుతుంది. ఇవి వరుసగా 510 కిమీ, 650 కిమీ రేంజ్ అందిస్తాయి. వీటి ధరలు వరుసగా రూ. 41 లక్షలు, రూ. 53 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కారు మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి ఉత్తమ పనితీరును అందిస్తాయి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)