రెండు కొత్త గోల్డ్‌ ఫండ్స్‌.. రూ. 1,000 నుంచి ఇన్వెస్ట్‌ చేయొచ్చు..

Published on Mon, 08/25/2025 - 17:01

ఏంజెల్‌ వన్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ కొత్తగా గోల్డ్‌ ఈటీఎఫ్, గోల్డ్‌ ఈటీఎఫ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌లను (ఎఫ్‌వోఎఫ్‌) ప్రవేశపెట్టింది. గోల్డ్‌ ఈటీఎఫ్‌ సెప్టెంబర్‌ 2తో, ఎఫ్‌వోఎఫ్‌ సెప్టెంబర్‌ 3తో ముగుస్తుంది. దేశీయంగా పసిడి ధరలను ట్రాక్‌ చేసే ఈ ఫండ్స్‌.. పుత్తడిలో సులభతరంగా ఇన్వెస్ట్‌ చేసే సాధనాలుగా ఉపయోగపడతాయి.

ఈటీఎఫ్‌లో రూ. 1,000 నుంచి ఇన్వెస్ట్‌ చేయొచ్చు. డీమ్యాట్‌ లేకుండానే పసిడిలో ఇన్వెస్ట్‌ చేసేందుకు ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ ఉపయోగపడుతుంది. ఇందులో రోజుకు రూ. 250 నుంచి సిప్‌ రూపంలో ఇన్వెస్ట్‌ చేయొచ్చు. మ్యూచువల్‌ ఫండ్స్‌ అసోసియేషన్‌ యాంఫీ ప్రకారం దేశీయంగా పసిడి ఆధారిత ఎక్సే్చంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ మార్కెట్,  2024 జూలైలో రూ. 34,455 కోట్లుగా ఉండగా 2025 జూలై నాటికి రూ. 67,634 కోట్లకు పెరిగింది.  

యాక్సిస్‌ నిఫ్టీ 500 క్వాలిటీ 50 ఇండెక్స్‌ ఫండ్‌.. 
దేశీయంగా అత్యంత నాణ్యమైన యాభై కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేసేందుకు వీలుగా నిఫ్టీ500 క్వాలిటీ 50 ఇండెక్స్‌ ఫండ్‌ను యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ప్రవేశపెట్టింది. ఇందులో సెప్టెంబర్‌ 4 వరకు ఇన్వెస్ట్‌ చేయొచ్చు. నిఫ్టీ 500 నుంచి ఎంపిక చేసిన యాభై స్టాక్స్‌ ఈ సూచీలో ఉంటాయి.

ఈక్విటీపై అత్యధిక రాబడులు, తక్కువ రుణభారం, స్థిరమైన ఆదాయ వృద్ధిలాంటి అంశాలను స్టాక్స్‌ ఎంపికలో పరిగణనలోకి తీసుకుంటారు. ఇందులో కనీసం రూ. 100 నుంచి ఇన్వెస్ట్‌ చేయొచ్చు. 2025 జూలైతో ముగిసిన 15 ఏళ్ల వ్యవధిలో నిఫ్టీ 50 వార్షికంగా 12.1 శాతం వృద్ధి చెందగా, నిఫ్టీ 500 క్వాలిటీ 50 ఇండెక్స్‌ 15. 6 శాతం వృద్ధి రేటు సాధించినట్లు సంస్థ తెలిపింది.

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)