నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!
Breaking News
‘టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు మా పనే’.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్
ఎస్ఎస్ఆర్, ఎస్ఐఆర్ మధ్య తేడాలివే.. సింపుల్‌గా తెలుసుకోండి
రాబోయే ఎన్నికల్లో కూటమికి సింగిల్ డిజిట్ కూడా రాదు: వైఎస్ జగన్
ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు
ఏపీలో ఎక్కడా స్వేచ్ఛగా నామినేషన్లు వేయనివ్వడం లేదు!
ఎస్ఈసీని కలిసిన వైఎస్ జగన్
మా టైం వచ్చినప్పుడు మేమేంటో చూపిస్తాం: వైఎస్ జగన్
కోల్‌కతా తొక్కిసలాట: సీఎం సువేందు ఉన్నత స్థాయి సమీక్ష
సీఈసీ నియామకంపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
బాబుకు ఓటమి భయం పట్టుకుంది: వైఎస్ జగన్
పార్ట్నర్ పార్టీకి.. బాబు పార్టీ నుంచే అభ్యర్థుల సప్లై: వైఎస్ జగన్
తొక్కిసలాట విషాదం: పలు మండపాల్లో పూజల నిలిపివేత
ఏపీలో అధర్మ, రక్త చరిత్ర నడుస్తోంది: వైఎస్ జగన్
వైఎస్ జగన్ ప్రెస్‌మీట్ హైలైట్స్
జనసైనికుల ఆర్తనాదాలు.. నమ్మించి.. ఆపై నిండా ముంచిన పవన్ కల్యాణ్?!
బంగారం, వెండి ధరలు ఇలా..
19 మంది మృతి ‘సర్వసాధారణం’!.. తొక్కిసలాటపై బీజేపీ మంత్రి
ఏపీలో ఎమర్జెన్సీ రోజులు తలపిస్తున్నాయి: పెద్దిరెడ్డి
చెన్నైలో భారీ వర్షం: అధికారులకు సీఎం విజయ్ ప్రత్యేక ఆదేశాలు
ఎన్నడూ లేనిది.. నితీష్‌ను పొగిడిన ప్రశాంత్ కిశోర్
CM Jagan: ఎన్ని అడ్డంకులొచ్చినా ప్రగతిపథంలోనే..
Published on Wed, 12/20/2023 - 11:57
ఆంధ్రప్రదేశ్ విద్య, వైద్యం, పరిశ్రమలు, వ్యవసాయం, కార్మికరంగం.. ఇలా ఏ రంగంలో చూసిన గతంతోపోలిస్తే అభివృద్ధి చెందింది. కొవిడ్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితులు నెలకొన్నా..ద్రవ్యోల్బణం వెంటాడుతున్నా దేశంలోని కొన్ని రాష్ట్రాలు తిరిగి వాటి పూర్వస్థితి కంటే మెరుగైన ఫలితాలను సాధిస్తున్నాయి. అందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నో రంగాల్లో ముందుంది.
- రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు స్థాపించాలంటే వివిధ శాఖల అనుమతులు అవసరం అవుతాయి. అవి పొందాలంటే యాజమాన్యాలకు కొంత శ్రమతో కూడుకున్న వ్యవహరం. అయితే వీటన్నిటినీ కేంద్రీకృతం చేసి ఇండస్ట్రీయల్ సింగిల్ విండో క్లియరెన్స్‌ను అమలులోకి తెచ్చిన వాటిల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి రాష్ట్రం.
- సోలార్ పవర్, ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల అభివృద్ధి కోసం రాష్ట్రం ప్రత్యేక చట్టాలను చేసింది.
- 2023-24 సంవత్సరానికిగాను స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (జీఎస్డీపీ) రూ.14,49,501 కోట్లుగా ఉంది. ఇది చంద్రబాబు పాలన ముగిసిన 2018-19కి గాను రూ.8,70,849 కోట్లుగా ఉండేది. గడిచిన ఈ కొన్నేళ్లలో ఇది దాదాపు 65 శాతం ఎక్కువ.
- 2021-22లో స్థూల విలువ ఆధారిత (జీవీఏ)వృద్ధి 18.47%గా ఉంది.
- దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేలా నాణ్యమైన మౌలిక సదుపాయాలను సృష్టించేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. అక్టోబర్ 2019 నుంచి మార్చి 2023 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్‌లోకి వచ్చిన విదేశీ సంస్థాగత పెట్టుబడులు రూ.6వేల కోట్లు.
- 2023లో రాష్ట్ర సరుకుల ఎగుమతులు రూ.1.58లక్షల కోట్లు. ఇందులో గరిష్ఠంగా సముద్ర ఉత్పత్తుల వల్ల దాదాపు 13.62% వాటా చేకూరింది.

- కొత్త పారిశ్రామిక విధానం ద్వారా రూ.22,282.16 కోట్లతో భారీ, మెగా పారిశ్రామిక ప్రాజెక్టులు స్థాపించేలా ప్రభుత్వం కృషిచేసింది.
- టీడీపీ హయాంలో పరిశ్రమల అభివృద్ధిలో 27వ స్థానానికి దిగజారిన రాష్ట్రం.. ప్రస్తుతం జగన్ పాలనలో మూడో స్థానానికి ఎగబాకింది.
- ఏప్రిల్ 2023 నాటికి, ఆంధ్రప్రదేశ్ మొత్తం స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 26,675.73 మెగావాట్లు.
- తలసరి ఆదాయంలో చంద్రబాబు హయాంలో 17 స్థానంలో నిలిచిన రాష్ట్రం ప్రస్తుతం 9వ స్థానానికి ఎదిగింది.
- చంద్రబాబు ప్రభుత్వకాలంలో కేవలం 34000 ఉద్యోగాలు ఇచ్చారు. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 4.93లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారు. అందులో 2.13లక్షల శాశ్వత కొలువులు ఉన్నాయి.
- వ్యవసాయంలో రాష్ట్రం టీడీపీ కాలంలో మైనస్ 6.5శాతంతో అధ్వానంగా మారింది. అదే 2021-22కు గాను 8.2 శాతం వృద్ధి చెందింది. దాంతో వ్యవసాయ వృద్ధిలో దేశంలోనే ఐదో స్థానంలో నిలిచింది. 2022-23కుగాను వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాలకు రూ.13,640 కోట్లు కేటాయించారు.
ఇదీ చదవండి: రూ.1000 కోట్లు ఆదా చేసిన ప్రభుత్వం..
#
Tags : 1