Breaking News

పారిస్‌లో కొత్తజంట..అథ్లెట్ల గురించి ఏం చెబుతున్నారంటే..

Published on Thu, 08/01/2024 - 14:16

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముఖేశ్‌ అంబానీ చిన్న కుమారుడు, కోడలు అనంత్‌ అంబానీ-రాధిక మర్చంట్‌ పారిస్‌ ఒలింపిక్స్‌లో సందడి చేశారు. భారత క్రీడాకారుల ‍‍మ్యాచ్‌లు వీక్షించిన అనంతరం ఈ నవ దంపతులు మీడియాతో మాట్లాడారు. ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత అథ్లెట్లు మరిన్ని పథకాలు సాధిస్తారని విశ్వసిస్తున్నట్లు చెప్పారు.

ఈ సందర్భంగా అనంత్‌ అంబానీ మాట్లాడుతూ..‘దేవుడి దయతో భారత క్రీడాకారులు చాలా అద్భుతంగా రాణిస్తున్నారు. ఇండియా చాలా పతకాలు సాధిస్తుందని అనుకుంటున్నాను. భారత అథ్లెట్లు ప్రతి ఇండియన్‌ గర్వపడేలా చేస్తారని విశ్వసిస్తున్నాను’ అన్నారు. అనంత్ భార్య రాధిక మర్చంట్ మాట్లాడుతూ..‘పారిస్‌ ఒలింపిక్స్‌లో మొదటి ఇండియా మ్యాచ్‌ని వీక్షించినందుకు చాలా సంతోషంగా ఉంది. భారత్‌ ఆటగాళ్ల తీరు అద్భుతంగా ఉంది. మరింత ఉత్సాహంతో పోటీల్లో పాల్గొని మరిన్ని విజయాలు సాధిస్తారని నమ్ముతున్నాను. ఈ క్రీడల వల్ల చాలామంది యువకులు స్ఫూర్తి పొందుతున్నారు’ అని చెప్పారు.

ఇదీ చదవండి: బ్యాంకు సర్వీస్‌ ప్రొవైడర్‌పై ర్యాన్సమ్‌వేర్‌ దాడి!

పారిస్‌ ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత ‍క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అక్కడ రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ‘ఇండియా హౌజ్‌’ పేరుతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భారత సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా దాన్ని రూపొందించారు. రిలయన్స్‌ ఫౌండేషన్‌  అధ్యక్షురాలు, ఐవోఏ సభ్యురాలు నీతా అంబానీ ఇటీవల ఇండియా హౌజ్‌లో భారతీయ  క్రీడాకారుల విజయాలను సెలబ్రేట్‌ చేశారు. వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఇప్పటికే రెండు పతకాలతో స్టార్ షూటర్ సరబ్జోత్ సింగ్‌, మనుభాకర్‌ పారిస్‌లో విజయఢంకా మోగించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)