Breaking News

అనంత్‌ చేతికి అరుదైన వాచ్‌: ప్రత్యేకతలివే..

Published on Thu, 01/02/2025 - 12:35

కొంతమందికి కార్లంటే ఇష్టం, మరికొందరికి బైకులు, ఇంకొందరికి వాచీలు. ఇలా ఎవరి అభిరుచి వారిది. అయితే వాచీలను ఎక్కువగా ఇష్టపడే వారిలో భారతీయ కుబేరుడు ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు 'అనంత్ అంబానీ' (Anant Ambani) కూడా ఒకరు. గతేడాది 'రాధికా మర్చెంట్'ను (Radhika Merchant) పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడైన అనంత్.. ఇటీవల ఓ ఖరీదైన వాచ్ ధరించి కనిపించారు.

అనంత్ అంబానీ ధరించిన వాచ్ ధర ఏకంగా రూ. 22 కోట్లు అని తెలుస్తోంది. ఇది ది రిచర్డ్ మిల్లే RM 52-04 స్కల్ బ్లూ సఫైర్. ప్రపంచంలోనే అత్యంత అరుదైన వాచీలలో ఇది ఒకటి. ఇలాంటివి ప్రపంచంలో కేవలం మూడు మాత్రమే ఉన్నాయని సమాచారం. ఈ వాచ్ రష్యా అధ్యక్షుడు 'వ్లాదిమిర్ పుతిన్‌' ప్రెస్ సెక్రటరీ 'డిమిత్రి పెస్కోవ్‌' (Dmitry Peskov) వద్ద కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

రిచర్డ్ మిల్లే RM 52-04 బ్లూ సఫైర్ ఒకే పీస్‌తో తయారు చేశారు. ఇది చూడటానికి చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ వాచ్ మాత్రమే కాకుండా అనంత్ అంబానీ వద్ద పటెక్ ఫిలిప్పె, అడెమార్స్ పిగ్యుట్ వంటి ఇతర బ్రాండెడ్ వాచీలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

రిచర్డ్ మిల్లే RM 52-04 స్కల్ బ్లూ సఫైర్ ప్రత్యేకతలు
ఒకే పీస్‌తో తయారైన ఈ వాచ్ మధ్య భాగంలో ఒక పుర్రె ఆకారం.. క్రాస్‌బోన్‌ ఉండటం చూడవచ్చు. దీని కింద వంతెనల లాంటి నిర్మాణాలను చూడవచ్చు. ఇవన్నీ ఖరీదైన మెటల్‌తో రూపొందించడం వల్ల చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. పేరుకు తగ్గట్టుగానే ఇది నీలం రంగులో ఉండటం కూడా గమనించవచ్చు, ఇది ఐస్ క్యూబ్ మాదిరిగా ఉంటుంది.

అనంత్ అంబానీ
అనంత్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు. అనంత్‌ జూలై 12, 2024న రాధిక మర్చంట్‌ను పెళ్లి చేసుకున్నారు. ఈయన వద్ద ఖరీదైన వాచీలు మాత్రమే కాకుండా.. రోల్స్ రాయిస్ కల్లినన్ వంటి కార్లు కూడా ఉన్నాయి. ఇషా అంబానీ, ఆకాష్ అంబానీలు.. అనంత్ అంబానీ తోబుట్టువులు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)