'ఇదో మంచి ఆలోచన': ఆనంద్ మహీంద్రా ట్వీట్

Published on Sat, 06/22/2024 - 19:09

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ.. ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉండే పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) తాజాగా ఓ ఆసక్తికరమైన వీడియో షేర్ చేస్తూ ఇదో మంచి ఆలోచన అంటూ ట్వీట్ చేశారు.

దేశంలో అక్కడక్కడా వర్షాలు పడుతూనే ఉన్నాయి. పెద్ద నగరాల్లో వర్షం పడితే ప్రజలకు కొంత ఇబ్బందిగానే ఉంటుంది. మొత్తానికి ముంబైలో రుతుపవనాలు కొంత తగ్గుముఖం పట్టాయి, అంటూ ఆనంద్ మహీంద్రా వీడియో షేర్ చేశారు.

ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో ఓ వ్యక్తి గొడుగును.. బ్యాగ్ మాదిరిగా తగిలించుకుని వెళ్లడం చూడవచ్చు. గొడుగుకు రెండువైపులా ఇనుప తీగల వంటి పరికరాలను అమర్చుకున్నారు. దాన్ని ఒక బ్యాగ్ మాదిరిగా తగిలించుకున్నారు. ఇలా చేయడం వల్ల గొడుగును పట్టుకోవడానికి ప్రత్యేకంగా చేతులను ఉపయోగించాల్సిన అవసరం లేదు. వీడియోలో గొడుగును తగిలించుకుని చేతులతో వస్తువులను తీసుకెళ్లడం కూడా చూడవచ్చు.

ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే వేలసంఖ్యలో వ్యూవ్స్ పొందిన ఈ వీడియోపై కొందరు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో ఒకరు మహీంద్రా గొడుగులు కావాలని కామెంట్ చేస్తే.. మరొకరు హ్యుయెన్ త్సాంగ్ 7వ శతాబ్దంలో ఇలాంటిది కలిగి ఉన్నారని అన్నారు.

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)