Breaking News

‘ఇదే భవిష్యత్తు అయితే మాత్రం అదో పీడకలే’.. వీడియో వైరల్‌

Published on Mon, 03/11/2024 - 18:44

నిత్యం టెక్నాలజీలో మార్పులు వస్తోన్నాయి. అందులో చాలా వరకు మనుషులకు ఉపయోగపడే ఆవిష్కరణలు చేస్తుంటే.. మరికొన్ని మనుషులను సోమరులుగా చేసేవి వస్తున్నాయి. మితిమీరిన సాంకేతిక వినియోగంతో అనర్థాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్రా ఈ టెక్నాలజీ వల్ల జరిగే నష్టాలను తెలియజేసేందుకు తన ‘ఎక్స్‌’ ఖాతాలో ఒక వీడియో పోస్ట్‌ చేస్తూ ఆందోళన వ్యక్తంచేశారు. 

ఆ వీడియోలో.. షాపింగ్‌మాల్‌లో ఓ యువకుడు ఒక చేతిలో పాప్‌కార్న్‌, మరో చేతిలో కూల్‌డ్రింక్‌ పట్టుకుని సింగిల్‌ వీల్‌ ఏఐ స్కూటర్‌పై వెళుతుంటాడు. కళ్లకు విజన్‌ ప్రో అద్దాలు, స్కూటర్‌ హ్యాండిల్‌కు రెండు స్మార్ట్‌ఫోన్‌లు ఉంటాయి. ఈ వీడియోను ఉద్దేశిస్తూ.. టెక్నాలజీతో పూర్తిగా కనెక్టయి.. వాస్తవ ప్రపంచంతో డిస్‌కనెక్ట్‌ అయ్యాడని ఆనంద్‌ మహీంద్రా తెలిపారు. ఇదే భవిష్యత్తు అయితే మాత్రం అదో పీడకలగానే ఉండనుందని ట్వీట్ చేశారు. 

ఇదీ చదవండి: భారీగా తగ్గనున్న చాక్లెట్లు, వాచీల ధర..!

ఆనంద్‌ మహీంద్రా పోస్ట్‌ చేసిన ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆయనతో ఏకీభవిస్తూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘టెక్నాలజీ వచ్చాక చాలామంది పిల్లలు తమ బాల్యాన్ని సరిగా ఆస్వాదించడం లేదు’. ‘రాబోయే రోజుల్లో మనుషులు ఒకరితో ఒకరు మాట్లాడుకొనే పరిస్థితి ఉండదు. ఎక్కువగా మెషీన్లతోనే కనెక్ట్‌ అవుతారు’అని కామెంట్లు వస్తున్నాయి.

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)