Breaking News

ఎంతగానో ఆకట్టుకుంది: ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్

Published on Thu, 02/27/2025 - 12:20

కోల్‌కతా నుంచి చెన్నైకి కేవలం మూడు గంటల్లో ప్రయాణించడం సాధ్యమేనా అని కొందరు అనుకోవచ్చు. కానీ ఇది త్వరలోనే సాధ్యమవుతుంది. చెన్నైకి చెందిన స్టార్టప్ కంపెనీ 'వాటర్ ఫ్లై టెక్నాలజీస్' తయారు చేసిన ఈ-ఫ్లైయింగ్‌ బోట్‌ ద్వారా ఇది సాకారమవుతుంది. ఐఐటీ మద్రాస్‌ సాయంతో ఈ సంస్థ తయారు చేసిన వింగ్-ఇన్-గ్రౌండ్ (విగ్) (wing-in-ground (WIG)) క్రాఫ్ట్‌ ద్వారా కోల్‌కతా నుంచి చెన్నైకి కేవలం మూడు గంటల్లో ప్రయాణించవచ్చని.. నిర్వాహకులు చెబుతున్నారు. ఇది ఆనంద్ మహీంద్రాను సైతం ఫిదా చేసింది.

స్టార్టప్‌లను పెంచడంలో సిలికాన్ వ్యాలీకి పోటీగా నిలుస్తామని ఐఐటీ మద్రాస్ హామీ ఇచ్చింది. దాదాపు ప్రతి వారం కొత్త 'టెక్ వెంచర్'లకు సంబంధించిన వార్తలు వస్తూనే ఉంటాయి. అందులో వింగ్-ఇన్-గ్రౌండ్ (విగ్) క్రాఫ్ట్‌ నన్ను ఎంతగానో ఆకట్టుకుందని 'ఆనంద్ మహీంద్రా' ట్వీట్ చేశారు.

బెంగళూరులోని ఏరో ఇండియా 2025లో వింగ్-ఇన్-గ్రౌండ్ (విగ్)ను ఆవిష్కరించారు. ఇది కేవలం రూ.600 ఖర్చుతో మూడు గంటల్లో చెన్నై- కోల్‌కతా మధ్య ప్రయాణం చేస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఇది ప్రజల దృష్టిని కూడా ఎంతగానో ఆకర్శించింది.

వింగ్-ఇన్-గ్రౌండ్ (విగ్)
ఈ-ఫ్లయింగ్ బోట్ ‘విగ్ క్రాఫ్ట్ గ్రౌండ్ ఎఫెక్ట్’ అనే సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. నీటి నుంచి సుమారు నాలుగు మీటర్ల ఎత్తులో ఇది ఎగురుతుంది. ఇది గాల్లో నిలకడగా ఎగురుతూనే నిర్దిష్ట వేగంతో ప్రయాణిస్తుందని కంపెనీ అధికారులు తెలిపారు. ఈ ఫ్లయింగ్‌ బోట్‌ విగ్‌ క్రాఫ్ట్‌ పూర్తిస్తాయిలో అందుబాటులోకి వస్తే చెన్నై నుంచి కోల్‌కతాకు 1,600 కిలోమీటర్లు ప్రయాణానికి సీటుకు కేవలం రూ.600 ఖర్చు అవుతుందని అంటున్నారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)