470 ఎకరాల అడవిని నిర్మించిన నాయర్: ఆనంద్ మహీంద్రా ట్వీట్

Published on Thu, 04/10/2025 - 12:47

తన ఎక్స్ ఖాతాలో ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసే.. దేశీయ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా తాజాగా ఓ వీడియో షేర్ చేశారు. మియావాకి అడవి అంటే ఏమిటో నాకు తెలుసు, కానీ డాక్టర్ నాయర్ గురించి తెలియదు అని పోస్ట్ చేశారు.

ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో ఒక అడవిని చూడవచ్చు. భారతదేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద మియావాకి అడవిని డాక్టర్ నాయర్ ఎలా సృష్టించారో నాకు తెలియదు. సుస్థిరతకు ప్రాధాన్యం లేని ఈ రోజుల్లో.. మన మధ్య ఇలాంటి హీరోలు ఉండటం గర్వకారణం అని ఆయన ట్వీట్ చేశారు.

నాయర్ నిర్మించిన అడవి
గుజరాత్‌లోని కచ్‌లో నాయర్ సుమారు 470 ఎకరాల విస్తీర్ణంలో అడవిని నిర్మించారు. ఇందులో 3,00,000 కంటే ఎక్కువ చెట్లు ఉన్నాయి. ఈ అడవిని జపనీస్ వృక్షశాస్త్రజ్ఞుడు అకిరా మియావాకి టెక్నాలజీ సాయంతో అభివృద్ధి చేశారు. ఈ పద్ధతిలో సహజ పర్యావరణ వ్యవస్థలను అనుకరించడానికి వివిధ రకాల స్థానిక వృక్ష జాతులను దగ్గరగా నాటడం జరుగుతుంది. దీని ఫలితంగా ఇవి సాధారణ మొక్కలకంటే 10 రెట్లు వేగంగా పెరుగుతాయి.

ఎవరీ డాక్టర్ నాయర్
డాక్టర్ నాయర్ పర్యావరణవేత్త & ఎన్విరో క్రియేటర్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు. 2014లో ఈయన 1500 చెట్లతో.. మియావాకి అడవిని ప్రారభించడం మొదలుపెట్టారు. ఇలాంటి  అడవులను ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ నిర్మించారు. వీటిలో చెప్పుకోదగ్గది కచ్‌లోని స్మృతివన్ మియావాకి అడవి. దీనిని 2001 గుజరాత్ భూకంప బాధితులకు నివాళిగా నిర్మించారు. కాగా 2030 నాటికి 100 కోట్ల చెట్లను నాటడమే లక్ష్యంగా డాక్టర్ నాయర్ ముందుకు సాగుతున్నారు.

మియావాకి పద్దతి
1970లో జపనీస్ వృక్షశాస్త్రజ్ఞుడు అకిరా మియావాకి ఈ టెక్నాలజీని ప్రవేశపెట్టారు. ఈ పద్ధతిలో మొక్కలను దగ్గరదగ్గరగా నాటుతారు. కాబట్టి ఇవి సాధారణ చెట్ల కంటే 10 రేట్లు వేగంగా పెరుగుతాయి. ఈ పద్దతిలో మొక్కలను పెంచడం వల్ల మట్టి కూడా ఆరోగ్యంగా ఉంటుందని తెలుస్తోంది.

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)