Breaking News

దక్షిణ భారత్‌లోనే అతిపెద్ద మహీంద్రా డీలర్‌షిప్‌

Published on Tue, 05/06/2025 - 18:20

భారతదేశంలోని అతిపెద్ద ఆటోమొబైల్ రిటైల్ సంస్థలలో ఒకటైన ఆటోమోటివ్ మానుఫ్యాక్చరర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (AMPL) విజయవాడలో.. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద మహీంద్రా డీలర్‌షిప్‌ను ప్రారంభించింది.

విజయవాడలోని ఏలూరు రోడ్డు, ఎనికెపాడులో ఉన్న ఈ కొత్త డీలర్‌షిప్‌ 1.03 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. 14 వాహనాలను ఒకేసారి ప్రదర్శించగల కెపాసిటీ ఉన్న ఈ షోరూమ్‌లో.. ప్యాసింజర్ వెహికల్ (ఐసీఈ & ఈవీ), స్మాల్ కమర్షియల్ వెహికల్ (ఎస్‌సీవీ), లాస్ట్ మైల్ మొబిలిటీ (ఎల్‌ఎంఎం) వాహనాలన్నీ లభిస్తాయి.

ఈ కొత్త డీలర్‌షిప్‌ ద్వారా కేవలం సేల్స్ మాత్రమే కాకుండా.. సర్వీస్, వాహనాలకు అవసరమైన ఫాస్ట్-ఛార్జింగ్ సౌకర్యం కలిగి ఉంటుంది. టెక్నాలజీని ప్రతిబింబించేలా.. ఆకర్షణీయమైన డిజైన్ పొందిన ఈ షోరూమ్‌ 61 కొత్త సర్వీస్ బేలు కలిగి ఉంది. ఇవి ఏడాదికి 28000 మందికి సేవలను అందించగలవు.

అతిపెద్ద మహీంద్రా డీలర్‌షిప్‌ ప్రారంభంతో.. ఆటోమోటివ్ మానుఫ్యాక్చరర్స్ ప్రైవేట్ లిమిటెడ్ దేశవ్యాప్తంగా తన విస్తృత నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేసుకుంటోంది. ఈ గ్రూప్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో 135 మహీంద్రా టచ్‌పాయింట్‌లను నిర్వహిస్తోంది.

FY 2025లో ఈ గ్రూప్ 37,000 మహీంద్రా వాహనాలను విక్రయించింది. అంటే ప్రతి 13 నిమిషాలకు ఒక వాహనం అమ్ముడుపోయిందనమాట. దీంతో AMPL భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న OEM కోసం అతిపెద్ద సేల్స్ అండ్ ఆఫ్టర్-సేల్స్ భాగస్వామిగా నిలిచింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)