Breaking News

సైబర్‌ మోసాలు.. రూ.177 కోట్ల నష్టం

Published on Tue, 08/06/2024 - 13:06

టెక్నాలజీ పెరుగుతోంది. ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌ వాడకం ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలో సైబర్‌ మోసాలు అధిమవుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో డెబిట్‌/ క్రెడిట్‌కార్డు - ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌లో జరిగిన సైబర్‌ మోసాల వల్ల ప్రజలు రూ.177 కోట్లు నష్టపోయినట్లు ప్రభుత్వం తెలిపింది.

2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ నష్టం రూ.69.68 కోట్లుగా ఉందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. 2021-22లో ఇది రూ.80.33 కోట్లు, 2020-21లో రూ.50.10 కోట్లు, 2019-20లో రూ.44.22 కోట్లుగా ఉందని చెప్పారు. అనధికార లావాదేవీలు జరిగినపుడు బ్యాంకులు స్పందించి చర్యలు తీసుకునేంత వరకు కస్లమర్లే దీనికి బాధ్యత వహించాలి. ఈ లావాదేవీల వల్ల కలిగే నష్టాన్ని పరిమితం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మార్గదర్శకాలు  జారీ చేసింది. ఏదైనా అనధికార లావాదేవీలు జరిగిన మూడు పనిదినాల్లోగా సంఘటనను రిపోర్ట్ చేయాలి. అలాంటి ట్రాన్సాక్షన్స్‌కు సాంకేతికలోపం కారణమని రుజువైతే దానికి బ్యాంకులే బాధ్యత వహిస్తాయి. ఏదేమైనా అనధికార లావాదేవీలు జరిగినట్లు గుర్తిస్తే వెంటనే బ్యాంకు దృష్టికి తేవాలని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: మూడు నెలల్లో రూ.60 లక్షల కోట్లు లావాదేవీలు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)