Breaking News

అమితాబ్‌ అల్లుడు.. వేలకోట్ల కంపెనీకి రారాజు: ఎవరీ నందా?

Published on Wed, 02/19/2025 - 17:09

నిఖిల్ నందా (Nikhil Nanda).. ఈ పేరు బహుశా ఎవరికీ తెలుసుండకపోవచ్చు. కానీ బాలీవుడ్ నటుడు 'అమితాబ్ బచ్చన్' అల్లుడు అంటే కొంతమందికి, ఎస్‌కార్ట్స్‌ కుబోటా లిమిటెడ్‌ చైర్మన్ అంటే మరికొందరికీ తెలిసే ఉంటుంది. వ్యాపార రంగంలో తనదైన గుర్తింపు పొందిన నందా గురించి ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం..

1974 మార్చి 18న జన్మించిన నిఖిల్ నందా.. డెహ్రాడూన్‌లోని ప్రతిష్టాత్మక డూన్ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసి, పెన్సిల్వేనియా యూనివర్సిటీలోని.. వార్టన్ స్కూల్‌లో బిజినెస్ మేనేజ్మెంట్ చదివారు. ఆ తరువాత ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్‌లో ఉన్న నైపుణ్యంతో.. ఎస్‌కార్ట్స్‌ కుబోటా లిమిటెడ్‌లో పగ్గాలు చేపట్టాడు. కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలతో.. నందా నాయకత్వంలో కంపెనీ ఉన్నత శిఖరాలను చేరింది.

నిఖిల్ నందా.. దిగ్గజ నటుడు & చిత్రనిర్మాత రాజ్ కపూర్ కుమార్తె అయిన రీతు నందా కుమారుడు. దీంతో అతను రిషి కపూర్, రణధీర్ కపూర్, రాజీవ్ కపూర్ వంటి ప్రముఖులకు మేనల్లుడు అయ్యాడు. కరిష్మా కపూర్, కరీనా కపూర్ ఖాన్, రణబీర్ కపూర్ కూడా ఇతనికి బంధువులే. నటులకు దగ్గర బంధువు కావడం చేత నందాకు చలనచిత్ర పరిశ్రమలో కూడా సంబంధాలు ఉన్నాయి.

అమితాబ్ బచ్చన్ & జయా బచ్చన్ కుమార్తె 'శ్వేతా బచ్చన్'ను నిఖిల్ నందా పెళ్లి చేసుకున్నాడు. వీరికి నవ్య నవేలి నందా, అగస్త్య నందా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. నవ్య తన పాడ్‌కాస్టింగ్ వెంచర్‌లతో తనదైన ముద్ర వేసినప్పటికీ, అగస్త్య ఇటీవల జోయా అక్తర్ నెట్‌ఫ్లిక్స్ చిత్రం "ది ఆర్చీస్"తో వినోద ప్రపంచంలోకి అడుగుపెట్టాడు.

ఇదీ చదవండి: ఆన్‌లైన్‌ లవ్‌.. రూ.4.3 కోట్లు అర్పించేసుకున్న మహిళ

నిఖిల్ నందా.. ఎస్‌కార్ట్స్‌ కుబోటా లిమిటెడ్‌ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్‌. ఈ కంపెనీ రూ. 42,141 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో దూసుకెళ్తోంది. ఈ సంస్థ వ్యవసాయ యంత్రాలు, నిర్మాణ యంత్రాలు, మెటీరియల్ హ్యాండ్లింగ్, రైల్వే పరికరాలను తయారు చేస్తూ.. ఈ విభాగంలోని అత్యుత్తమ కంపెనీలలో ఒకటిగా ఉంది.

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)