Breaking News

సీఈవో సుందర్ పిచాయ్‌కు ఉద్యోగుల బహిరంగ లేఖ: కీలక డిమాండ్లు

Published on Thu, 03/23/2023 - 14:45

న్యూఢిల్లీ: ప్రపంచ టెక్ కంపెనీల్లో ఉద్యోగాల ఊచకోత తీవ్ర కలవరం పుట్టిస్తోంది. ముఖ్యంగా ట్విటర్‌, మెటా, గూగుల్‌ తదితర దిగ్గజ కంపెనీలు కూడా  భారీగా లేఆఫ్స్‌  ప్రకటించడం ప్రస్తుత సంకక్షోభం పరిస్థితికి అద్దుపడుతోంది. ఈ ఆర్థిక సంక్షోభం ఉద్యోగాల తీసివేత నేపథ్యంలో గూగుల్‌ ఉ ద్యోగులు సీఈవోకు సుందర్‌ పిచాయ్‌కి బహిర లేఖ లేశారు. కొన్ని కీలక డిమాండ్లతో రాసిన ఈ లెటర్‌ హాట్‌ టాపిక్‌గా నిలిచింది.

గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్ ఇంక్.లో దాదాపు 1,400 మంది ఉద్యోగులు ఈ  బహిరంగ లేఖ రాశారు. ఉద్యోగులకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చేలా లేఆఫ్ ప్రక్రియలో మెరుగైన విధానాల్ని పాటించాల కోరుతూ పిటిషన్‌పై వీరంతా సంతకం చేశారు. ఈ సందర్భంగా కొన్ని కీలక డిమాండ్లను చేయడం గమనార్హం. అయితే ఈ లేఖపై ఆల్ఫాబెట్ ప్రతినిధి ఇంకా స్పందించలేదు. 

గూగుల్‌ సీఈవోకు ఉద్యోగులకు రాసిన లేఖలో ముఖ్యంగా  కొత్త నియామకాలను స్తంభింప జేయడం, తొలగింపులకు ముందు స్వచ్ఛంద తొలగింపులను కోరడం, ఉద్యోగ ఖాళీల భర్తీకి  తొలగించిన ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వాలని,  మెటర్నిటీ, బేబీ బాండింగ్ వంటి సెలవుల్లో ఉన్న వారిని అర్థాంతరంగా తొలగించకుండా, వారి షెడ్యూల్డ్‌ సెలవులను పూర్తి చేయడానికి అనుమతించడం వంటి అనేక డిమాండ్లను ఇందులో ఉద్యోగులు చేశారు. దీనికి తోడు ఉక్రెయిన్, రష్యా వంటి యుద్ధ సంక్షోభ ప్రాంతాలకు చెందిన తోటి ఉద్యోగులను తొలగించవద్దని కూడా విజ్ఞప్తి చేశారు. అలా చేయటంతో  అక్కడి ఉద్యోగులు వీసా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. సంక్షోభ ప్రాంతాలకు చెందిన ఉద్యోగులకు అదనపు సహాయాన్ని కంపెనీ అందించా లన్నారు. లింగ, జాతి, కుల, వయస్సు, మతం, వైకల్యాలు లాంటి వివక్షలు లేకుండా ఉద్యోగుల పట్ల వ్యవహరించాలని ఉద్యోగులు తమ లేఖలో సుందర్ పిచాయ్ ని కోరారు. కంపెనీ 12వేల ఉద్యోగాలను  తీసివేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఈ లేఖ చర్చకు దారి తీసింది. 

Videos

మన యుద్ధం చంద్రబాబు ఒక్కడితో కాదు..!

అండర్ గ్రౌండ్ లో అవినీతి తీగ

హైదరాబాద్ శిల్పకళావేదికలో మిస్ వరల్డ్ టాలెంట్ ఫైనల్

Watch Live: వైఎస్ జగన్ కీలక ప్రెస్ మీట్

వాషింగ్టన్ డీసీలో కాల్పుల కలకలం

దీన్నే నమ్ముకొని ఉన్నాం.. మా పొట్టలు కొట్టొద్దు.. ఎండీయూ ఆపరేటర్ల ధర్నా

నా పర్మీషన్ తీసుకోవాల్సిందే!

ఢిల్లీ-శ్రీనగర్ విమానానికి తప్పిన ప్రమాదం

ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు బండారం బయటపడుతుందనే ఉరవకొండకి రాలేదు

జనసేనపై పిఠాపురం టీడీపీ నేతలు సంచలన వ్యాఖ్యలు..

Photos

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

కాన్స్‌లో అదితి : ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)