Breaking News

అమెజాన్‌ ఆఫర్‌: ఇలా చేస్తే రెడ్‌మీ ఏ1 స్మార్ట్‌ఫోన్‌ రూ.1000లోపు సొంతం చేసుకోవచ్చు!

Published on Sat, 01/07/2023 - 20:33

కొత్త సంవత్సరంలో కొత్త స్మా‍ర్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా ? అయితే ఈ శుభవార్త మీ కోసమే. దిగ్గజ ఈకామర్స్‌ సంస్థ అమెజాన్‌లో తన కస్టమర్లకు ఈ అద్భుత ఆఫర్‌ను తీసుకువచ్చింది.  మార్కెట్లో డిమాండ్‌ ఉన్న రెడ్‌మి స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపుని అందిస్తోంది. అమెజాన్‌ ప్రకటించిన ఆఫర్లన్నీ ఉపయోగిస్తే ఈ మొబైల్‌ వెయ్యి రూపాయలు లోపు చెల్లించి మన ఇంటికి తెచ్చుకోవచ్చు. అదెలాగో చూద్దాం!                              

రెడ్‌మి ఏ1 స్మార్ట్‌ఫోన్ .. ఇది మరో రకంగా బడ్జెట్‌ ఫోన్‌ అని చెప్పవచ్చు. అమెజాన్‌ వెబ్‌సైట్‌లో దీని ధర రూ. 8,999గా ఉంది. ఈ ధరపై 28 శాతం తగ్గింపు కూడా ఉంది. దీంతో తగ్గింపు పోను రూ. 6,499కే కస్టమర్లు కొనేయచ్చు. అంతేనా ఇది కాకుండా మరో అదిరిపోయే డీల్స్‌ కూడా ఉన్నాయి, వాటిపై ఓ లుక్కేద్దాం.

ఈ ఫోన్‌పై బ్యాంక్ ఆఫర్ కింద రూ. 620 వరకు తగ్గింపు లభిస్తోంది. అలాగే అమెజాన్ ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొంటే 5 శాతం క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. ఇలా మీకు అదనపు ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. నెలవారీ ఈఎంఐ రూ. 311 నుంచి ప్రారంభం అవుతోంది. నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై భారీ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. దాదాపు రూ. 6,100 వరకు ఈ తగ్గింపు ఉంటుంది. ఫైనల్‌గా రూ.1000 లోపే ఈ ఫోన్‌ మన సొంతం చేసుకోవచ్చు. తమ పాత ఫోన్ ఇచ్చి ఈ ఫోన్ కొనాలని భావించే వారికి ఇది బెస్ట్‌ డీల్ అని చెప్పాలి. ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే.. మీ ఫోన్ మోడల్, అది ఉన్న కండీషన్ ప్రాతిపదికన మీకు వచ్చే ఎక్స్చేంజ్ బోనస్ మారుతుంది.

#

Tags : 1

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)