Breaking News

యూజర్లకు గుడ్‌ న్యూస్‌: అమెజాన్ ప్రైమ్ లైట్ ప్లాన్‌ వచ్చేసింది!

Published on Thu, 06/15/2023 - 16:40

యూజర్లకు తీపికబురు చెప్పింది ఈకామర్స్ దిగ్గజం అమెజాన్‌. అమెజాన్  ప్రైమ్ లైట్  సబ్‌స్క్రిప్షన్  ప్లాన్‌ను  గురువారం దేశంలో ప్రారంభించింది.  ఇప్పటివరకు దేశంలో కొంతమందికి టెస్టింగ్‌లో అందుబాటులో ఉన్న ఈ సర్వీసును ఇపుడిక అందరికీ అందిస్తోంది. అంతేకాదు రెగ్యులర్ అమెజాన  ప్రైమ్ వీడియో ప్లాన్‌ ఫీజు 1499రూపాయలతో పోలిస్తే ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్ ధర రూ. 999గా  ఉండటం గమనార్హం. అంటే రూ. 500 తక్కువ. 

అమెజాన్  ప్రైమ్ లైట్  సబ్‌స్క్రిప్షన్,  ప్రయోజనాలు 
అమెజాన్ ప్రైమ్ ప్రయోజనాలను మరింత సరసమైన ధరకు యాక్సెస్ చేయాలనుకునే కస్టమర్‌లకు ఇది  చీపెస్ట్‌ ఆప్షన్‌. అమెజాన్ వెబ్‌సైట్‌లో లేదా యాప్ ద్వారా కూడా  సబ్‌స్క్రిప్షన్ తీసుకోవచ్చు. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా అన్ని అమెజాన్ ఆర్డర్లపై 5 శాతం డిస్కౌంట్  అందుబాటులో ఉంటుంది.  

అయితే ప్రైమ్ వీడియో మాదిరిగా గాకుండా ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్‌లో యాడ్స్ ఉంటాయి.  ఈ ప్రకటనల వ్యవధి, ఫ్రీక్వెన్సీ వివరాలను పేర్కొన లేదు.  కొన్ని పరిమితులతో ప్రైమ్ వీడియో కంటెంట్  యాక్సెస్‌తో పాటు, అదనపు ఖర్చు లేకుండా రెండు రోజుల డెలివరీల ఆప్షన్‌ను అందిస్తోంది. (రూ. 1600 కోట్ల ఇంద్రభవనం అమ్మకానికి ఎక్కడో తెలుసా? భారతీయుడి మోజు)

అలాగే ప్రైమ్ లైట్ ప్లాన్‌లో అమెజాన్ మ్యూజిక్, అమెజాన్ గేమింగ్, ప్రైమ్ రీడింగ్ అందుబాటులో ఉండవు. అమెజాన్ ప్రైమ్ లైట్‌లో ఏడాది సబ్‌స్క్రిప్షన్  మాత్రమే ఉంది. కాగా  ఏడాది  ప్రారంభంలో కొంతమంది వినియోగదారులతో ప్లాన్‌ను పరీక్షించడం ప్రారంభించిన సంగతి తెలిసిందే.  (యూట్యూబర్లకు గుడ్‌ న్యూస్‌, 500 చాలట!)

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)