నామినేషన్ వేసి అవసరమైతే జైలుకు వెళ్తామయ్య.. రిపోర్టర్ కి పేర్ని నాని అదిరిపోయే రిప్లై
Breaking News
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ వచ్చేసింది!
Published on Sun, 09/20/2026 - 19:18
ఆన్‌లైన్ షాపింగ్ చేసే వారి కోసం అమెజాన్ మరోసారి తన 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026 సేల్' తీసుకొస్తోంది. ఈ ఫెస్టివ్ సేల్ అక్టోబర్ 8 నుంచి ప్రారంభం కానుంది. స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, టీవీలు, గృహోపకరణాలు, ఫ్యాషన్ తదితర విభాగాల్లో వివిధ డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ అందుబాటులో ఉండనున్నాయి.
ఫెస్టివ్ సేల్ సమయంలో అమెజాన్ ప్రైమ్ సభ్యులకు 10 శాతం వరకు అదనపు ప్రయోజనాలు లభిస్తాయని సమాచారం. అయితే.. ఈ ప్రయోజనం ఏయే ఉత్పత్తులకు వర్తిస్తుంది?, గరిష్ఠంగా ఎంత బెనిఫిట్ లభిస్తుంది?, అనే పూర్తి వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఈ సేల్‌లో ఎస్‌బీఐ డెబిట్ కార్డులు, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులు, క్రెడిట్ కార్డు ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందించనున్నట్లు అమెజాన్ ప్రకటించింది. అయితే.. ఈ ఆఫర్‌కు కొన్ని నిబంధనలు, ఉత్పత్తి లేదా లావాదేవీకి సంబంధించిన పరిమితులు వర్తించే అవకాశం ఉంది. అలాగే.. అర్హత ఉన్న ఉత్పత్తులపై ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయాలు కూడా ఉండనున్నాయి.
స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, గృహోపకరణాలు వంటి ఉత్పత్తుల కొనుగోలుపై ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, ఈఎంఐ సదుపాయాలు వినియోగదారులకు అదనపు పొదుపును అందించే అవకాశం ఉంది. అయితే.. ప్రతి ఉత్పత్తికి ఆఫర్ ఒకే విధంగా ఉండకపోవచ్చు. అందువల్ల కొనుగోలు చేసే ముందు సంబంధిత ఉత్పత్తికి వర్తించే నిబంధనలను పరిశీలించడం ముఖ్యం.
ఈసారి అమెజాన్ Play & Win Rewards పేరుతో మరో ప్రచార కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తోంది. ఇందులో స్మార్ట్‌ఫోన్లు, ఇతర బహుమతులు ఉన్నట్లు సమాచారం. అయితే ఇందులో ఎవరు పాల్గొనవచ్చు, రివార్డుల విలువ ఎంత, ఎలా గెలుచుకోవచ్చు అనే పూర్తి వివరాలను అమెజాన్ ఇంకా వెల్లడించలేదు.
Tags : 1