Breaking News

అమెజాన్‌ గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్ వచ్చేస్తోంది..ఆఫర్లు  ఎలా ఉన్నాయంటే?

Published on Sat, 07/29/2023 - 11:22

 Amazon Great Freedom Festival sale 2023 ఆన్‌లైన్‌ దిగ్గజం  మరోసారి ఫెస్టివల్‌ సేల్‌ను షురూచేసింది. అమెజాన్ గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్ ఆగస్ట్ 5వ తేదీన ప్రారంభం కానుంది. స్వాతంత్ర్య  దినోత్సవం సమీపిస్తున్న తరుణంలో, అమెజాన్ ఇండియా అద్భుతమైన సేల్ ఈవెంట్‌కు సిద్ధమవుతోంది. వివిధ ఉత్పత్తులపై ఆకర్షణీయమైన తగ్గింపులను అందిస్తోంది.

ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్స్, ల్యాప్ టాప్స్, హోం అప్లయన్సెస్, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, తదితర  పలు  విభాగాల్లో  ఆకర్షణీయమైన డిస్కౌంట్లు లభించనున్నాయి. దీనికి తోడు ఎస్‌బీఐ  క్రెడిట్ కార్డ్  ద్వారా జరిపే కొనుగోళ్లపై అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.

ప్రతీ ఆగస్ట్ నెలలో  గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్ ప్రకటించే అమెజాన్‌ ఈ ఏడాది  గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్ తేదీలను శుక్రవారం ప్రకటించింది. ఈ సేల్ ఆగస్ట్  5 నుంచి 9వ తేదీ వరకు  నాలుగు రోజుల పాటు కొనసాగుతుంది. ప్రైమ్ మెంబర్స్ కు ఒక రోజు ముందే ఈ సేల్ ప్రారంభమవుతుంది అనేది తెలిసిన సంగతే. కొనుగోళ్లపై స్పెషల్ ఫ్లాట్ డిస్కౌంట్‌తోపాటు, బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్చేంజ్ బోనస్, వీటన్నింటికి తోడు క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అందుబాటులోఉంటాయి.  ముఖ్యంగా ఈ సేల్ లో  శాంసంగ్‌ వన్ ప్లస్, రియల్ మి, ఎంఐ తదితర కంపెనీల స్మార్ట్ ఫోన్స్ పై 40 శాతానికి మించి డిస్కౌంట్ లభించనుంది. (పెరిగిన బంగారం ధరలు, వెండి కూడా పైపైకే)

వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు వంటి గృహోపకరణాలు కూడా ఆకర్షణీయమైన తగ్గింపు ధరల లభ్యం. సోనీ ప్లేస్టేషన్ 5  ఇతర గేమింగ్ ఉత్పత్తులపై 50 శాతం వరకు తగ్గింపు. గేమ్‌లు కూడా గరిష్టంగా 80 శాతం తగ్గింపుతో అందుబాటులో ఉంటాయి. ల్యాప్‌టాప్‌లు , వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. టీజర్ పేజీ ల్యాప్‌టాప్‌లు, ఇయర్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు మరియు అనేక ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై 75 శాతం వరకు తగ్గింపు లభించనుంది. అంతేకాకుండా యాపిల్‌, తదితర కంపెనీల టాబ్లెట్‌లు గరిష్టంగా 50 శాతం తగ్గింపుతో అందుబాటులో ఉంటాయి.

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)