Breaking News

Microsoft-Amazon Deal: రెండు టెక్‌ దిగ్గజాలు పోటీని పక్కన పెట్టి.. భారీ ఒప్పందం!

Published on Wed, 10/18/2023 - 11:41

రెండు బలమైన టెక్‌ దిగ్గజాలు పోటీని పక్కన పెట్టి పరస్పరం సహకరించుకునేందకు సిద్ధమ​య్యాయి. బిజినెస్ ఇన్‌సైడర్ ప్రకారం.. మైక్రోసాఫ్ట్‌ (Microsoft) దాని క్లౌడ్ ఆధారిత 365 ఉత్పాదకత సూట్ కోసం అమెజాన్‌ (Amazon.com)ని ముఖ్యమైన క్లయింట్‌గా స్వాగతించడానికి సిద్ధమైంది. 

1 బిలియన్ డాలర్ల (రూ.83 వేల కోట్లకు పైగా ) కంటే ఎక్కువ విలువైన ఈ ఒప్పందం ఇద్దరు టెక్ దిగ్గజాలకు ఒక మైలురాయిని సూచిస్తోంది. సాధారణంగా బలమైన పోటీదారులుగా ఉండే ఈ రెండు కంపెనీలు ఇలా సహకరించుకోవడం టెక్నాలజీ పరిశ్రమలో సరికొత్త ఒరవడికి నాంది పలుకుతోంది.

ఐదేళ్లకు మించి ఉండే ఈ ఒప్పందం కోసం అమెజాన్.. మైక్రోసాఫ్ట్‌కు భారీ మొత్తాన్ని కట్టబెట్టనుందని నివేదిక పేర్కొంది. ఇందులో భాగంగా మైక్రోసాఫ్ట్‌ 365 కోసం అమెజాన్‌ పది లక్షలకు పైగా లైసెన్స్‌లను కొనుగోలు చేయాలని భావిస్తోంది.

ఈ నివేదిక బయటకు వచ్చిన తర్వాత, మైక్రోసాఫ్ట్‌ షేర్ ధర 1 శాతం  మేర పెరిగింది. అయితే దీనిపై వ్యాఖ్యానించడానికి మైక్రోసాఫ్ట్‌ నిరాకరించింది. మరో వైపు అమెజాన్ కూడా ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

నివేదిక ప్రకారం, నవంబర్ ప్రారంభంలో ఈ కొత్త సిస్టమ్‌లను ఏకీకృతం చేయడం ప్రారంభించాలని అమెజాన్ భావిస్తోంది. అమెజాన్‌ ప్రస్తుతం మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌ (Microsoft Office) ఉత్పత్తుల స్థానిక, ఆన్-సైట్ వెర్షన్‌ను ఉపయోగిస్తోంది. అమెజాన్‌ కొత్త సిస్టమ్‌ల ఇన్‌స్టాలేషన్‌ను నవంబర్‌లో ప్రారంభించలనుకుంటుండగా ఏఐ సామర్థ్యాలతో అప్‌గ్రేడ్‌ చేసిన మైక్రోసాఫ్ట్‌ 365 (Microsoft 365) సూట్‌ను కూడా ఇదే నెలలో ప్రారంభించనుండటం గమనార్హం.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)