Breaking News

నో వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం.. లేదంటే ఇంటికెళ్లిపోండి!

Published on Wed, 08/30/2023 - 14:47

అమెజాన్‌ సీఈవో ఆండీ జెస్సీ  మరోమారు ఉద్యోగులకు హెచ‍్చరికలు జారీ చేశారు. ఇంటి నుండి పనిచేస్తున్న ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీస్‌ రావాల్సిందేనని ఆదేశించారు. అయితే, సీఈవో నిర్ణయంపై అసంతృప్తిలో ఉన్న సిబ్బంది ఉద్యోగాలకు రాజీనామా చేయాలని భావిస్తున్నారు. ఈ తరుణంలో ఆఫీస్‌కు వచ్చేందుకు ఇష్టపడని ఉద్యోగులు ఇంటికి వెళ్లిపోవచ్చంటూ ఇంటర్నల్‌గా జరిగిన సమావేశంలో ఆండీ జెస్సీ పునరుద్ఘాటిస్తూ చెప్పడంతో ఉత్కంఠతకు దారి తీసింది.  

ఈ ఏడాది ప్రారంభంలో, అమెజాన్ సీఈఓ ఆండీ జెస్సీ మాట్లాడుతూ.. ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసు నుండి పని చేయాల్సిందేనని అన్నారు. ఈ నిర్ణయానికి మిశ్రమ స్పందన వచ్చింది. కొంతమంది ఉద్యోగులు ఆఫీస్‌కి తిరిగి రావాలని, సహోద్యోగులతో కలిసి పని చేయాలని భావించగా..మరికొందరు జర్నీ, ఇతర ఖర్చుల్ని దృష్టిలో ఉంచుకుని ఆఫీస్‌కు వచ్చేందుకు ఇష్టపడడం లేదు.  

అసంతృప్తిలో ఉన్న ఉద్యోగులు కంపెనీ తీసుకున్న నియమాన్ని వ్యతిరేకిస్తున్నారు. అవసరం అయితే, మూకుమమ్మడిగా విధులు నిర్వహించకుండా నిరసన వ్యక్తం చేస్తామని హెచ్చరించారు. అమెజాన్‌ కంపెనీలో ఈ అసమ్మతి పర్వం కొనసాగుతుండగా.. ఆఫీస్‌కు వచ్చేందుకు ఇష్టపడని ఉద్యోగులు రాజీనామాకు మొగ్గు చూపుతున్నారు.

మరికొందరు కంపెనీ తీసుకున్న నిర్ణయం విషయంలో మరోమారు ఆలోచిస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి యాజమాన్యం తీసుకున్న నిర్ణయం ఎటు దారి తీస్తుందోనని అమెజాన్‌ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Videos

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)