Breaking News

ఏఎమ్‌ గ్రీన్‌తో డీపీ వరల్డ్‌ భాగస్వామ్యం

Published on Tue, 01/14/2025 - 14:56

గ్రీన్ హైడ్రోజన్, అమ్మోనియాను ఉత్పత్తి చేస్తున్న ఏఎమ్ గ్రీన్(AM Green) సుస్థిర అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంది. గ్రీన్ ఇంధనాలు, రసాయనాల కోసం స్థిరమైన సరఫరా అందించేందుకు డీపీ వరల్డ్‌(DP World)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ సహకారంతో డీకార్బనైజేషన్‌కు ప్రయత్నాలు జరుగుతాయని కంపెనీ తెలిపింది.

ఇటీవల కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం ప్రకారం రెండు కంపెనీలు తాజాగా భాగస్వామ్య పత్రాలపై సంతకాలు చేశాయి. ఏఎమ్ గ్రీన్, డీపీ వరల్డ్ సంయుక్తంగా ఈ పరిశ్రమలో లాజిస్టిక్స్, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయనున్నాయి. సంవత్సరానికి 1 మిలియన్ టన్నుల(MTPA) గ్రీన్ అమ్మోనియా, 1 ఎంటీపీఏ గ్రీన్ మిథనాల్‌ను ఎగుమతి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాయి. జీరో-కార్బన్ ఉద్గారాల కోసం యూరోపియన్ యూనియన్, యూఏఈలో అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయబోతున్నట్లు కంపెనీ తెలిపింది.

ఇదీ చదవండి: మొబైల్‌ రీఛార్జ్‌ మరింత భారం కానుందా..?

గ్రీన్ కో గ్రూప్ & ఏఎమ్ గ్రీన్ వ్యవస్థాపకుడు మహేష్ కొల్లి మాట్లాడుతూ..‘గ్రీన్ ఎనర్జీ ఎగుమతిదారుగా ఎదగాలనే భారతదేశ ఆశయానికి కంపెనీ కట్టుబడి ఉంది. గ్రీన్ మాలిక్యూల్స్‌తో వాతావరణ కాలుష్యాన్ని కట్టడి చేయవచ్చు. ఈ పరిశ్రమలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను నిర్మించడానికి డీపీ వరల్డ్‌లో భాగస్వామ్యం కావడం సంతోషకరం. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ మిథనాల్, ఇతర సుస్థిర ఇంధనాలను సమర్థవంతంగా ఎగుమతి చేయడానికి తోడ్పడుతుంది’ అన్నారు. డీపీ వరల్డ్ గ్రూప్ డిప్యూటీ సీఈఓ యువరాజ్ నారాయణ్ మాట్లాడుతూ..‘స్వచ్ఛమైన ఇంధనాలు, రసాయన ఉత్పత్తుల ఎగుమతిని సులభతరం చేయడానికి ఏఎమ్ గ్రీన్‌తో భాగస్వామ్యం కీలకం కానుంది’ అన్నారు.

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)