అనుబంధ కంపెనీని అమ్మేస్తున్న గూగుల్‌!

Published on Fri, 10/03/2025 - 08:29

టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌ (Google) మాతృ సంస్థ ఆల్ఫాబెట్ (Alphabet Inc.) తన లైఫ్ సైన్సెస్ యూనిట్‌ ‘వెరిలీ’ని వదిలించుకోవడానికి సిద్ధమైంది. వెరిలీని సాంకేతికంగా విడదీయడానికి ఆల్ఫాబెట్ గత రెండేళ్లుగా పనిచేస్తోందని, ఇందులో భాగంగా దాన్ని విక్రయించడమో లేదా విడిపడి వేరే సంస్థగా ఏర్పాటు చేయడమో జరుగుతుందని కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు.

గూగుల్ చట్టవిరుద్ధంగా ప్రకటనల సాంకేతికతను గుత్తాధిపత్యం చేసిందన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో ప్రతివాది సాక్షిగా హాజరైన గూగుల్ సెక్యూరిటీ ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్ హీథర్ అడ్కిన్స్ వెరిలీ ప్రణాళికలను వివరించారు.

వర్జీనియాలోని ఫెడరల్ కోర్టులో అడ్కిన్స్ మాట్లాడుతూ.. ఆల్ఫాబెట్ గొడుగు కింద గూగుల్‌కు సోదరి సంస్థగా ఉన్న వెరిలీ గత రెండున్నర సంవత్సరాలుగా గూగుల్ సొంత మౌలిక సదుపాయాల నుండి బయటపడటానికి, గూగుల్ క్లౌడ్ ప్లాట్‌ఫామ్‌లోకి వెళ్లడానికి కృషి చేస్తోందన్నారు.

"మేము వారిని (వెరిలీ) స్వతంత్ర సంస్థగా మార్చడానికి సహాయపడే ప్రక్రియలో ఉన్నాము" అని ఆమె యూనిట్ గురించి చెప్పారు. అది అమ్మకం లేదా స్పిన్ ఆఫ్ ద్వారా కావచ్చు అన్నారు. "ఇది (వెరిలీ) ఇకపై ఆల్ఫాబెట్ సంస్థగా ఉండకూడదన్నదే ఆలోచన" అని పేర్కొన్నారు.

వెరిలీ గురించి..

వెరిలీ అనేది గూగుల్‌ మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌కి చెందిన ఒక లైఫ్‌ సైన్సెస్‌ విభాగం. ఇది ఆరోగ్య పరిశోధన, ప్రెసిషన్‌ మెడిసిన్‌, డేటా ఆధారిత హెల్త్‌కేర్‌ పరిష్కారాలను అభివృద్ధి చేయడంలో నిమగ్నమై ఉంది. వెరిలీ (మునుపటి పేరు గూగుల్‌ లైఫ్‌ సైన్స్‌ సర్వీస్‌) 2015 డిసెంబర్‌లో ఏర్పాటైంది. ఆల్ఫాబెట్‌ ఏర్పాటైన తర్వాత, గూగుల్‌ లైఫ్‌ సైన్సెస్‌ నుంచి వెరిలీ పేరుతో విడిపోయింది.

#

Tags : 1

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)