ప్రముఖ బ్యాంకును అమ్మనున్న కేంద్రం..!

Published on Sat, 02/03/2024 - 14:13

కేంద్రం కొన్ని ప్రభుత్వసంస్థల నుంచి చాలా కాలంగా పెట్టుబడులను ఉపసంహరిస్తోంది. వ్యూహాత్మక విక్రయాల్లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటోందని పలుమార్లు చెప్పింది. తాజాగా ప్రముఖ బ్యాంకులోని ప్రభుత్వ వాటాను విక్రయించేందుకు సన్నద్ధం జరుగుతోంది.

ఈ ఆర్థిక సంవత్సరం 2024-25లో ఐడీబీఐ బ్యాంక్‌లోని తమ వాటాను ఉపసంహరించుకుంటామని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ (దీపం) కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే అన్నారు. పీటీఐ టీవీకి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పాండే మాట్లాడారు. ఐడీబీఐ బ్యాంక్‌ ప్రైవేటీకరణ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. ఈ క్రమంలోనే రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఐడీబీఐ వ్యూహాత్మక విక్రయం పూర్తవుతుందన్న ధీమా వ్యక్తం చేశారు.

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి భద్రతాపరమైన అనుమతి, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) నుంచి వ్యవస్థీకృత ఆమోదం లభిస్తే.. బ్యాంక్‌ను కొనేందుకు ఆసక్తి ఉన్నవారిని బిడ్ల ద్వారా ఆహ్వానిస్తామని తెలిపారు. ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంక్‌లో పరోక్షంగా, ప్రత్యక్షంగా కేంద్ర ప్రభుత్వానికి సుమారు 95 శాతం వాటా ఉంది. కేంద్ర ప్రభుత్వానికి 45 శాతం వాటా ఉండగా, ప్రభుత్వ రంగ బీమా సంస్థ అయిన లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ)కు 49.24 శాతం వాటా ఉంది. 

ఈ రెండు వాటాల్లో కలిపి మొత్తంగా దాదాపు 61 శాతం అమ్మేయాలని కేంద్రం యోచిస్తోంది. ఇక 2022 అక్టోబర్‌లోనే బిడ్లను ఆహ్వానించగా, 2023 జనవరిలో కొంటామని కొందరు ఆసక్తికనబరిచినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా, వచ్చే నెలాఖర్లోగా ఖజానాకు రూ.17,500 కోట్ల నిధులు అవసరం కానున్నాయి. సవరించిన అంచనాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ (సీపీఎస్‌ఈ)ల్లో పెట్టుబడుల ఉపసంహరణ, ఆస్తుల నగదీకరణతో రూ.30,000 కోట్లను ఖజానాకు తరలించాల్సి ఉంది.

ఇదీ చదవండి: పన్నుస్లాబ్‌ సవరణలపై నిర్మలమ్మ కీలక వ్యాఖ్యలు

ఇదిలా ఉండగా, ఐడీబీఐ బ్యాంకులో వాటా కొనుగోలు చేయాలనుకునే బిడ్డర్లకు కనీసం రూ.22,500 కోట్ల కనీస నికర సంపద, గత ఐదేళ్లలో కనీసం మూడేళ్లలో నికర లాభాలు ఉండాలనే నియమాలు ఉన్నాయి. ఒకవేళ బిడ్డర్లు కన్సార్టియంగా ఏర్పడితే.. గరిష్ఠంగా నలుగురు మాత్రమే ఉండాలని ‘దీపం’ షరతు విధించింది. డీల్‌ కుదిరితే బిడ్డర్లు కనీసం 40 శాతం వాటాలను ఐదేళ్ల వరకు తమ వద్దే అట్టిపెట్టుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

#

Tags : 1

Videos

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)