బిజినెస్‌లో స్పీడ్‌ పెంచిన అలియా భట్!

Published on Fri, 04/28/2023 - 20:27

వరుస సినిమాలతో దూసుకెళ్తున్న బాలీవుడ్ నటి అలియా భట్ బిజినెస్‌లోనూ స్పీడ్‌ పెంచింది. ఆమె 2020లో ప్రారంభించిన కాన్షియస్ కిడ్స్ దుస్తుల బ్రాండ్ ఎడ్-ఎ-మమ్మా (Ed-a-Mamma) విస్తరణ జోరుగా సాగుతోంది. గత ఆరు నెలల్లో ఈ బ్రాండ్ ప్రసూతి దుస్తులు, నర్సింగ్ వేర్‌, 11 నుంచి 17 ఏళ్ల వారి కోసం టీనేజ్‌ దుస్తులు, అప్పుడే పుట్టిన శిశువు నుంచి 2 ఏళ్ల లోపు చిన్నారుల కోసం ప్రత్యేక దుస్తులతో సహా నాలుగు కొత్త కేటగిరీలను ప్రారంభించింది.

ఇదీ  చదవండి: కొడుకు పెళ్లికి అంబానీ దంపతులు ఏం చేశారో తెలుసా? వెలుగులోకి కొత్త విషయం!

తల్లులు, పిల్లల కోసం ప్రత్యేక షాపింగ్‌ ఆలోచనతో ఎడ్-ఎ-మమ్మా బ్రాండ్‌ ప్రారంభమైందని, ఇప్పుడు తాము ప్రసూతి నుంచి 17 ఏళ్ల టీనేజర్ల వరకూ వారికి కావాల్సిన ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చినట్లు ఎడ్-ఎ-మమ్మా సీవోవో ఇఫ్ఫాట్ జీవన్ పేర్కొన్నారు.    

దుస్తులకే పరిమితం కాకుండా ఇతర ఉత్పత్తులకూ విస్తరించాలని ఎడ్-ఎ-మమ్మా బ్రాండ్‌ యోచిస్తోంది. అందులో భాగంగా పిల్లల సాహస కథల పుస్తకాలను ప్రారంభించాలనుకుంటున్నట్లు జీవన్‌ వెల్లడించారు. పుస్తకాలతో పాటు యానిమేటెడ్ సిరీస్‌లు, తల్లులు, పిల్లలకు కావాల్సిన ఇతర ఉత్పత్తలు, ఆటబొమ్మలు కూడా బ్రాండ్‌ ద్వారా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: Kresha Gupta: రూ.100 కోట్ల ఫండ్‌.. స్టాక్‌ మార్కెట్‌ యువ సంచలనం ఈమె!

ఎడ్-ఎ-మమ్మా బ్రాండ్ అంతర్జాతీయంగా కూడా విస్తరించాలని చూస్తోంది. త్వరలో మధ్యప్రాచ్యం, గల్ఫ్‌ దేశాలలో ప్రారంభిస్తామని, యూఎస్‌లో అమెజాన్‌లో కూడా అందుబాటులో ఉంటామని అని జీవన్ చెప్పారు. అంతేకాకుండా టైర్-2, టైర్-3 నగరాల్లో ఆఫ్‌లైన్ మోడల్‌కూ విస్తరించాలని చూస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి తమ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు అందుబాటులోకి వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)