Breaking News

ట్రాఫిక్ కష్టాలకు చెక్!.. ఇదో చక్కని పరిష్కారం..

Published on Sun, 09/22/2024 - 17:48

అభివృద్ధి చెందిన నగరాల్లో ట్రాఫిక్ కష్టాలు వర్ణనాతీతం. దీనికి పరిష్కారమే లేదా? అంటే.. ఓ మార్గం ఉంది. అదే ఫ్లైయింగ్ కార్లు. ఈ మాట ఎప్పటినుంచో చెబుతూనే ఉన్నారు, వచ్చిందేమో లేదు అంటారేమో.. అయితే ఎగిరే కారు కల నిజమయ్యే సమయం ఆసన్నమైంది. కాలిఫోర్నియాకు చెందిన కంపెనీ 'అలెఫ్ ఏరోనాటిక్స్' తన ప్రతిష్టాత్మకమైన ప్రణాళికతో ఎగిరే కార్లను జనంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది.

సినిమాల్లో కనిపించే ఫ్లైయింగ్ కార్లు.. నిజ జీవితంలోకి వస్తే ట్రాఫిక్ కష్టాలు తీరినట్టే. కాబట్టి అలెఫ్ ఏరోనాటిక్స్ 2025లో ఫ్లైయింగ్ కార్లను ఉత్పత్తి చేయనుంది. ఇది వ్యక్తిగత రవాణాలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. ఈ కార్ల ధర 300000 డాలర్లు ఉంటుందని అంచనా. ఇది చాలా ఎక్కువ ధర కావడంతో బహుశా దీనిని సామాన్య ప్రజలకు కొనుగోలు చేయలేకపోవచ్చనే తెలుస్తోంది.

కంపెనీ 2025నాటికి మోడల్ ఏ అనే ఫ్లైయింగ్ కారును ప్రారభించనుంది. కాగా దీని కోసం ఇప్పటికీ 3200 బుకింగ్స్ పొందినట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే.. ఈ ఎగిరేకారుకు డిమాండ్ భారీగానే ఉందని తెలుస్తోంది. యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కంపెనీ ప్రత్యేక ఎయిర్‌వర్తినెస్ సర్టిఫికేషన్‌ను పొందినట్లు సమాచారం. ఇది కీలక భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉందని చెబుతున్నారు.

ఇదీ చదవండి: ఇదే జరిగితే.. 75శాతం యూపీఐ ట్రాన్సక్షన్స్ ఆపేస్తారు!

అలెఫ్ మోడల్ ఏ డెలివరీలు 2025 నాలుగో త్రైమాసికంలో ప్రారంభమవుతాయని తెలుస్తోంది. మోడల్ ఏ తరువాత కంపెనీ మోడల్ జెడ్ అనే మరో కారును లాంచ్ చేసే అవకాశం ఉంది. దీని ధర 35000 డాలర్లు ఉంటుందని అంచనా. దీనికి సంబంధించిన మరిన్ని అధికారిక వివరాలు తెలియాల్సి ఉంది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)