Breaking News

జడ్చర్లలో అక్షయకల్ప ప్రాసెసింగ్‌ ప్లాంటు

Published on Fri, 01/24/2025 - 05:06

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: రసాయనరహిత, సేంద్రియ ఆహారానికి డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో డెయిరీ ఉత్పత్తుల సంస్థ అక్షయకల్ప ఆర్గానిక్‌ హైదరాబాద్‌ మార్కెట్‌పై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా తెలంగాణలోని జడ్చర్లలో రూ. 20 కోట్లతో ప్రాసెసింగ్‌ ప్లాంటు ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ సీఈవో శశికుమార్‌ తెలిపారు. ప్రాథమికంగా రోజుకు 40 వేల లీటర్ల సామర్థ్యంతో ఏర్పాటవుతున్న ఈ ప్లాంటు ఆరేడు నెలల్లో అందుబాటులోకి రాగలదని ఆయన చెప్పారు. 

షాద్‌నగర్‌ ఫార్మ్‌లో ప్రస్తుతం 65 మంది రైతులతో కలిసి పని చేస్తుండగా, వచ్చే మూడేళ్లలో దీన్ని 380మందికి పెంచుకోనున్నట్లు, అక్కడ పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని కూడా నెలకొల్పినట్లు వివరించారు. ఇప్పుడు మూడు క్లస్టర్లు ఉండగా పుణెలో మరొకటి ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు శశికుమార్‌ చెప్పారు. ఇప్పటివరకు సుమారు రూ. 250 కోట్ల పైగా నిధులు సమీకరించగా .. రూ. 200 కోట్లు ఇన్వెస్ట్‌ చేసినట్లు వివరించారు. గత ఆర్థిక సంవత్సరం రూ. 285 కోట్ల ఆదాయం నమోదు చేయగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ. 400 కోట్ల పైగా అంచనా వేస్తున్నట్లు వివరించారు.  

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)