Breaking News

కస్టమ్స్‌కు విదేశీ ప్రయాణికుల డేటా షేరింగ్‌ 

Published on Tue, 12/31/2024 - 06:25

న్యూఢిల్లీ: విమానయాన సంస్థలు ఇకపై అంతర్జాతీయ ప్రయాణికుల డేటాను కస్టమ్స్‌ విభాగానికి కూడా తప్పనిసరిగా అందించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు 2025 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇందుకోసం విమాన రవాణా సేవల సంస్థలు జనవరి 10 నాటికి నేషనల్‌ కస్టమ్స్‌ టార్గెటింగ్‌ సెంటర్‌–ప్యాసింజర్‌ (ఎన్‌సీటీసీ–ప్యాక్స్‌)లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 

కేంద్రీయ పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డు (సీబీఐసీ) జారీ చేసిన ఆదేశాల ప్రకారం .. అంతర్జాతీయ ఫ్లయిట్‌ బయలుదేరడానికి 24 గంటల ముందుగానే విదేశీ ప్రయణికుల మొబైల్‌ నంబరు మొదలుకుని టికెట్‌ కోసం చెల్లింపులు జరిపిన మాధ్యమం, ట్రావెల్‌ షెడ్యూల్‌ వరకు పలు వివరాలను కస్టమ్స్‌ అధికారులకు ఎయిర్‌లైన్స్‌ అందించాలి. ఒకవేళ విమానయాన సంస్థ గానీ డేటాను షేర్‌ చేసుకోవడంలో విఫలమైన పక్షంలో, అలా చేసిన ప్రతిసారి రూ. 25,000–50,000 వరకు కస్టమ్స్‌ విభాగం జరిమానా విధించవచ్చు.   

ఆదాయపన్ను శాఖ ఖండన 
పన్ను ఎగవేతదారులను పట్టుకునేందుకు తాము డిజీయాత్ర యాప్‌ డేటాను చూడడం లేదని ఆదాయపన్ను శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు వస్తున్న వార్తలను ఖండిస్తూ ఎక్స్‌ ప్లాట్‌ఫామ్‌పై పోస్ట్‌ పెట్టింది. ‘‘ఇందుకు సంబంధించి ఇప్పటి వరకు అలాంటి చర్య ఏమీ లేదని స్పష్టం చేస్తున్నాం’’అని అందులో పేర్కొంది. ముఖ గుర్తింపు విధానంలో (ఎఫ్‌ఆర్‌టీ) పనిచేసే డిజీ యాత్ర విమానాశ్రయాల్లో పలు చెక్‌ పాయింట్ల వద్ద ఎలాంటి అవాంతరాల్లేకుండా ముందుకెళ్లేందుకు వీలు కల్పిస్తుంది. డిజీ యాత్ర యాప్‌ కోసం ప్రయాణికులు ఇచ్చే సమాచారం ఎన్‌క్రిపె్టడ్‌ విధానంలో నిల్వ ఉంటుంది. ఆధార్‌ ఆధారిత ధ్రువీకరణ ద్వారా ప్రయాణికులు డిజీయాత్ర సేవలను పొందొచ్చు.   

Videos

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)